×

బ్రహ్మోత్సవాల ప్రారంభంనాటికంతా అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి-శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఆదేశాలు

బ్రహ్మోత్సవాల ప్రారంభంనాటికంతా అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి-శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఆదేశాలు

శ్రీశైల  దేవస్థానం: బ్రహ్మోత్సవాల ప్రారంభంనాటికంతా అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని  శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఆదేశాలు  ఇచ్చారు.ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు  మార్చి 1  నుంచి  11 వ తేదీ వరకు
11 రోజులపాటు నిర్వహిస్తారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు బుధవారం  సాయంకాలం
సమీక్షా సమావేశం జరిపారు.

ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ఈ నెల 18వ తేదీన ప్రాథమిక సమావేశం
జరిగింది. ఆ సమావేశంలో నిర్ణయాలకు అనుసరించి వివిధ విభాగాలలో
చర్యలను కార్య నిర్వహణాధికారి పెద్దిరాజు  సమీక్షించారు.

ఈ సమావేశంలో కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ అన్ని విభాగాల వారు కూడా
బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నము కావాలన్నారు.ఏర్పాట్లన్ని కూడా ముందస్తుగానే పూర్తి కావాలన్నారు. ప్రతి విభాగం కూడా ఇప్పటికే రూపొందించుకున్న ఆక్షన్‌ష్లాన్‌ (ఏర్పాట్ల ప్రణాళిక) అనుసరించి ఆయా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.బ్రహ్మోత్సవాల ప్రారంభంనాటికంతా అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు.

తరువాత ఉత్సవాలలో నిర్వహించాల్సిన ఆయా వైదిక కార్యక్రమాలు, వాహనసేవలు,
స్వామిఅమ్మవార్లకు పట్టువస్తాల సమర్పణ, ఉత్సవాల సమయములో ఆలయ వేళలు, దర్శనం ఏర్పాట్లు
మొదలైన వాటి గురించి చర్చించారు.

పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం,
సాక్షిగణపతి మొదలైన చోట్ల చేయవలసిన ఏర్పాట్లను కూడా ముందస్తుగా పూర్తి చేయాలన్నారు. అటవీశాఖ
వారి సహకారముతో నడకదారిలో వచ్చే భక్తులకు ఆయా ఏర్పాట్లను కల్పించాలని సంబంధిత విభాగాలను
ఆదేశించారు.అదేవిధంగా గతంలో వలనే శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్‌ ఏర్పాటు చేయాలన్నారు. శివదీక్షా
శిబిరాల వద్ద జ్యోతిర్ముడి సమర్పణకు అవసరమైన సదుపాయాలను కల్పించాలన్నారు.

ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం క్యూలైన్లన్నింటినీ గత సంవత్సరంకంటే వీలైనంత
మేరకు పెంపుదల చేయాలన్నారు. క్యూలైన్లన్నీ ధృడంగా ఉండేవిధంగా ఏర్పాటు చేయాలన్నారు.క్యూకాంప్లెక్స్‌ లో  , క్యూలైన్ల లో  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. నిరంతరం మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం మొదలైనవాటిని అందజేస్తుండాలన్నారు.

మహాశివరాత్రికి వచ్చే భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు ఆరుబయలు ప్రదేశాలలో పైప్‌
పెండాల్స్‌, షామియానాలు మొదలైన వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్‌
అధికారులను ఈ ఓ   ఆదేశించారు. తాత్కాలిక వసతి ప్రదేశాలలో తప్పనిసరిగా మంచినీటి ఏర్పాటు ఉండాలని కూడా
ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.  తాత్కాలిక వసతి ప్రదేశాలలో తగినన్ని విద్యుద్దీపాలను
ఏర్పాటు చేయాలన్నారు.క్షేత్ర పరిధిలో అవసరమైన చోట్ల అదనపు కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు.
భక్తులరద్దీకనుగుణంగా క్షేత్రపరిధిలో పారిశుద్ద్య నిర్వహణ పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్భాలన్నారు.

ముఖ్యంగా అన్ని  శౌచాలయాలలో కూడా నిరంతరం శుభ్రపరిచే విధంగా చర్యలు చేపట్టాలని పారిశుద్ధ్య
విభాగాన్ని ఆదేశించారు ఈఓ . పార్కింగ్‌ ఏర్పాట్లు, సామానులు భద్రపరుచు గది, ట్రాఫిక్‌ నియంత్రణ మొదలైన అంశాలపై సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులు, భద్రతా విభాగం ప్రత్యేక శ్రద్ధ కనబర్బాలన్నారు. గత సంవత్సరం కంటే
కూడా ఈ సారి అదనపు ప్రదేశాలలో కూడా పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలన్నారు.

ప్రతి పార్కింగ్‌ ప్రదేశములోనూ తగినంత విద్యుద్దీపాలంకరణ ఉండాలన్నారు. ఆరుబయలు
ప్రదేశాలలో కూడా తగినన్ని విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.

మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని అవసరమైనచోట్ల సమాచార
బోర్డులను ,సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్‌ విభాగాన్ని , శ్రీశైలప్రభ
విభాగాన్ని ఆదేశించారు.

భక్తులను అలరించేందుకు ధార్మిక , సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని
ప్రజాసంబంధాల అధికారి ని ఆదేశించారు. ముఖ్యంగా ధార్మిక ప్రవచనాలు, హరికథలు, భక్తిరంజని,
సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు.

ఉత్సవాలలో _ పుష్పాలంకరణను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఉద్యానవన అధికారులను
ఆదేశించారు ఈ ఓ.

ఈ సమావేశంలో అధ్యాపక ( స్థానాచార్యులు). సీనియర్‌ వేదపండితులు, ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్లు,
సహాయ కమిషనర్‌, అన్నివిభాగాల సహాయ కార్యనిర్వహణాధికారులు, ప్రచురణల విభాగం సంపాదకులు,
ప్రజా సంబంధాల అధికారి, అన్నివిభాగాల పర్యవేక్షకులు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్లు (ఐ /సి) అసిస్టెంట్‌
ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed