
శ్రీశైల దేవస్థానం:శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆదివారం దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీప్రసన్నాంజనేయస్వామివారి ఆలయ ప్రాంగణంలోని రామాలయం లో శ్రీ సీతారామస్వామివార్ల కల్యాణ మహోత్సవం జరిగింది.
ఉదయం సీతారాములవారికి, ఆ తరువాత ఆంజనేయస్వామివారికి విశేష పూజాదికాలు జరిగాయి. తరువాత సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ముందుగా లోకసంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం , తరువాత కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపారు.అనంతరం వృద్ధి, అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవచనం జరిపారు.కంకణపూజ, కంకణధారణ, యజ్ఞోపవీతపూజ, యజ్ఞోపవీతధారణ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, గౌరీపూజ, మాంగల్య పూజ, శ్రీ సీతాదేవి వారికి మాంగల్యధారణ, తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో సంప్రదాయ బద్దంగా సీతారామ కల్యాణం జరిపారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.