శ్రీ అనంతపద్మనాభ స్వామి వారి దేవాలయం
అనంతగిరి ,పుప్పాలగూడ , ఖాజగూడ మణికొండ , హైదరాబాద్ *
శ్రీ అనంతపద్మనాభ చతుర్థి మహోత్సవం: 9-9-2022న*
శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో తేది : 9-9-2022 నాడు శ్రీ శ్రీ శ్రీ అనంతపద్మనాభ స్వామి
చతుర్థి సందర్భంగా శ్రీ సుదర్శన హోమం , శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం సామూహికంగా
శ్రీమాన్ STP భాస్కరాచార్యుల గారి నేతృత్వంలో యజ్ఞాచార్య శ్రీమాన్ మొలుగు రాఘవాచార్యులు గారి
ఆధ్వర్యంలో జరపటానికి ఆలయ కమిటీ వారు నిర్ణయించారు.
పూజ కార్యక్రమం :
ఉదయం 5.00 నుంచి 6.00 వరకు : సుప్రభాత సేవ, నిత్య ఆరాధన సేవాకాలం, శాత్తుమురై, బాలభోగం.
6.00 నుంచి 7.00 వరకు మూల విరాట్ కు పంచామృత అభిషేకం, అలంకరణ, అర్చన.
7. 30 నుంచి 9.30 వరకు శ్రీ సుదర్శన నృసింహ పద్మనాభ హోమం.
10.00 నుంచి 10.30 వరకు సామూహిక గోపూజ.
10. 30 నుంచి 11. 30 వరకు శ్రీ అనంత పద్మనాభ చతుర్థి వ్రతం.
12. 00 నుంచి 12.30 వరకు దివ్యప్రబంధ, వేద, ఇతిహాస, పురాణం వేద విన్నపము.
12.30: మహాపూర్ణాహుతి 1.00: తీర్థ ప్రసాద గోష్ఠి,భక్తులకు అన్న ప్రసాద వితరణ.
సూచన : భక్తులు శ్రీ సుదర్శన హోమం మరియు శ్రీ అనంత పద్మనాభ చతుర్థి వ్రతంలో పాల్గొన దల్చినవారు
ఆలయ కమిటీ వారిని సంప్రదించి వారు నిర్ణయించిన రుసుము కమిటీ వారికి చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని దేవస్థానం వారు తెలిపారు.
వివరాలకు సంప్రదించండి : 9441888889, 9959613681,9494415462