శ్రీశైల దేవస్థానంలో శ్రావణమాసోత్సవాలు ప్రారంభం
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు (09.08.2021)న శ్రావణమాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ శ్రావణమాసోత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీ వరకు జరుగుతాయి.
ఈ మాసోత్సవాల నిర్వహణకు గాను వివిధ విస్తృత ఏర్పాట్లుచేసారు. ముఖ్యంగా శ్రావణమాసంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఈ ఓ కే ఎస్.రామరావు తెలిపారు.
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ శ్రావణమాసోత్సవాలు నిర్వహించేలా చర్యలు ఉంటాయి.
శ్రావణమాసంలో పర్వదినాలు, ప్రభుత్వ సెలవురోజులను రద్దీ రోజులుగా గుర్తించారు.
కాగా క్యూ కాంప్లెక్స్ లో దర్శనానికి వేచి వుండే భక్తులకు ఉదయం వేళలో బిస్కెట్లు, మంచినీరు, ” అల్పాహారము అందించారు.
శ్రావణమాసాన్ని పురస్కరించుకుని కార్యాలయ అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. ఈ సిబ్బంది అంతా రద్దీ రోజులలో ఆలయం కైలాసం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్, ఆలయ మహాద్వారం, సమాచార మరియు విరాళాల కేంద్రం, ఆర్జిత సేవల నిర్వహణ మొదలైన చోట్ల ప్రత్యేక విధులు నిర్వహిస్తారు.
శ్రావణమాసంలో రద్దీ రోజులలో ఈ సిబ్బంది ప్రత్యేక విధులు నిర్వహిస్తారు. భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు , సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించేందుకుగాను సిబ్బంది అందరికీ ఈ ప్రత్యేక విధులు కేటాయించారు
భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని విడతలవారిగా ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు.
Post Comment