×

శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత  శ్రీ అంకాళమ్మ వారికి విశేష పూజలు

శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత  శ్రీ అంకాళమ్మ వారికి విశేష పూజలు

శ్రీశైలదేవస్థానం: లోక కల్యాణం కోసం, శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత  శ్రీ అంకాళమ్మ వారికి శుక్రవారం   ఉదయం అభిషేకం, విశేష పూజలను జరిపారు.ప్రతి శుక్రవారం శ్రీఅంకాళమ్మ వారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ నిర్వహిస్తారు. శ్రీ అంకాళమ్మ వారికి అభిషేకం, విశేష అర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలుజరిగాయి.

  అంకాళమ్మ ఆలయం, ప్రధాన ఆలయానికి ఎదురుగా రహదారికి చివరలో కుడివైపున ఉత్తరముఖంగా ఉంది.

ప్రకృతి శక్తుల  కళలే గ్రామ దేవతలని దేవీ భాగవతంలో ఉంది. ఈ ప్రకృతి అంతా ఆదిపరాశక్తి స్వరూపమేనని మన ఆర్షవాజ్ఞ్మయం చెబుతోంది. దైవశక్తి సమాజంలో  ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని తెలియజెప్పే మన విశిష్ట సంస్కృతి  ఉదాత్త వైఖరికి తార్కాణంగా ఈ గ్రామదేవత ఆరాధనను పేర్కొనవచ్చు.

చతుర్భుజాలను కలిగిన ఈ దేవి నాలుగు చేతులలో కుడివైపున క్రింది నుండి పైకి వరుసగా కత్తి, సర్పంలో చుట్టబడిన డమరుకం ఉండగా, ఎడమవైపున పానపాత్ర, త్రిశూలం ఉన్నాయి. కిరీట ముకుటం గల ఈ దేవి వస్త్రాలంకురాలై కర్ణాభరణాలను, కంఠాభరణాలను కలిగి ఉంటుంది.

కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజ  తరువాత లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.అనంతరం పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, విశేష అభిషేకం పూజలను జరిగాయి.

print

Post Comment

You May Have Missed