×

శ్రీ అంకాళమ్మ వారికి విశేష పూజలు

శ్రీ అంకాళమ్మ వారికి విశేష పూజలు

 శ్రీశైలదేవస్థానం:లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర  గ్రామ దేవత  శ్రీ అంకాళమ్మ వారికి  శుక్రవారం ఉదయం   అభిషేకం, విశేష పూజలను నిర్వహించారు.ప్రతి శుక్రవారం శ్రీఅంకాళమ్మ వారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ చేస్తున్నారు.ఇందులో భాగంగా శ్రీ అంకాళమ్మ వారికి అభిషేకం, విశేష అర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు చేసారు.

 అంకాళమ్మ ఆలయం, ప్రధాన ఆలయానికి ఎదురుగా రహదారికి చివరలో కుడివైపున ఉత్తరముఖంగా ఉంది.

ప్రకృతి శక్తుల  కళలే గ్రామ దేవతలని దేవీ భాగవతంలో ఉంది. ఈ ప్రకృతి అంతా ఆదిపరాశక్తి స్వరూపమేనని మన ఆర్షవాజ్ఞ్మయం చెబుతోంది. దైవశక్తి సమాజంలో ఏదో కొన్ని వర్గాలకు పరిమితం కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని తెలియజెప్పే మన విశిష్ట సంస్కృతి  ఉదాత్త వైఖరికి తార్కాణంగా ఈ గ్రామదేవత ఆరాధనను పేర్కొనవచ్చు.

చతుర్భుజాలను కలిగిన ఈ దేవి నాలుగు చేతులలో కుడివైపున క్రింది నుండి పైకి వరుసగా కత్తి, సర్పంలో చుట్టబడిన ఢమరుకం ఉండగా, ఎడమవైపున పానపాత్ర, త్రిశూలం ఉన్నాయి. కిరీట ముకుటం గల ఈ దేవి వస్త్రాలంకురాలై కర్ణాభరణాలను, కంఠాభరణాలను కలిగి ఉంటుంది.

కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజ ఆ తరువాత లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.అనంతరం పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, విశేష అభిషేకం అర్చన ను చేసారు.

print

Post Comment

You May Have Missed