
బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఆదివారం అమ్మవారికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న సీఎం దంపతులకు వేదమంత్రాలతో పూజారులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా… సాంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలను సీఎం కేసీఆర్ స్వయంగా తీసుకువెళ్లి
అమ్మవారికి సమర్పించారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు… దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్
యాదవ్, వి శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ లు కే.కేశవరావు,జోగినపల్లి సంతోష్
కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎండోమెంట్స్ కమిషనర్ అనిల్ కుమార్ ప్రజా ప్రతినిధులు
తదితరులు పాల్గొన్నారు.