
శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్రపాలకుడైన శ్రీబయలువీరభద్రస్వామివారికి అమావాస్యను పురస్కరించుకొని రేపు (08.08.2021) న విశేషపూజాదికలు నిర్వహిస్తారు.
భక్తులు ఈ విశేషపూజను పరోక్షసేవగా జరిపించుకునే అవకాశం కల్పించారు.
బయలు వీరభద్రస్వామివారికి నిత్యపూజాదికాలతో పాటు లోకకల్యాణార్థం దేవస్థానం ప్రతి మంగళవారం, అమావాస్య రోజులలో విశేషపూజాదికాలును ప్రస్తుతం నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం అమావాస్య రోజున జరిగే పూజలలో భక్తులు కూడా పాల్గొనే అవకాశం కల్పించారు.
ఈ పరోక్ష ఆర్జితసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించి సేవలో పాల్గొంటున్నారు.
ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగిపోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించబడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
కాగా శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు ఆయా సేవలను జరిపించుకునేందుకు వీలుగా గత సంవత్సరం ఏప్రియల్ 13న దేవస్థానం పరోక్షసేవ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం రాష్ట్ర దేవదాయశాఖ ఉన్నతాధికారులవారి ఆదేశాల మేరకు దేవస్థానం నిర్వహిస్తున్న ఈ పరోక్షసేవలను మరింతగా విస్తరింపజేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే ఈ పరోక్షసేవలో అమావాస్య రోజున బయలు వీరభద్రదస్వామివారికి విశేష పూజను జరిపించుకునే వీలుకూడా కల్పించారు.
ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైన వాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలుపుతున్నారు.
సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి | యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును.
ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351/52 | 53 / 54/55/56 లను సంప్రదించవచ్చును.