×

అపరాజితదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు

అపరాజితదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు

 శ్రీశైల దేవస్థానం:ప్రాచీన విగ్రహాల పరిరక్షణలో భాగంగా, క్షేత్రపరిధిలో పలుచోట్ల  ఉన్న  దేవతా విగ్రహాలను సేకరిస్తున్నారు.ఇటీవల కాలంలో స్థానికుల సూచనల మేరకు విభూతి మఠం వద్ద  అమ్మవారి విగ్రహాన్ని కూడా ఉద్యానవన కార్యాలయం లో భద్రపరిచారు.

కాగా కార్యాలయ భవనం లోని సహాయ స్థపతి  గదిలో ఉన్న  అపరాజితదేవి పాత విగ్రహాన్ని ఆలయ ప్రాంగణములోని జమ్మి చెట్టు క్రింద లోక కల్యాణం కోసం నెలకొల్పారు.

అపరాజిత దేవి విగ్రహాన్ని జమ్మిచెట్టు క్రింద నెలకొల్పడం శ్రేయస్కరమనే భావనతో దేవస్థానం సహాయ స్థపతి  పర్యవేక్షణలో ఈ విగ్రహం ఆలయ ప్రాంగణములో నెలకొల్పారు.

శ్రావణ శుక్రవారం , వరలక్ష్మీ వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని  ఉదయం ఈ విగ్రహానికి అభిషేకాది అర్చనలు జరిపారు. శ్రీస్వామివారి ఆలయ ప్రధానార్చకులు  శివప్రసాదస్వామి, అమ్మవారి ఆలయ ఉపప్రధానార్చకులు బి.వి.ఎస్. శాస్త్రి , అర్చక బృందం ఈ పూజాదికాలను నిర్వహించారు. ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్ తదితర సిబ్బంది  పాల్గొన్నారు.

దేవస్థాన వైదిక కమిటీ  సూచనల మేరకు ఈ పూజాదికాలను జరిపారు.

రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, సకాలంలో తగినంత వర్షాలు కురిపి, పంటలు బాగా పండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని,  పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని,  ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని, భక్తులందరికీ శ్రేయస్సు కలగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలనే ఈ పూజాదికాలను చేసారు.

అనంతరం చంద్రవతి కల్యాణ మండపంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిపారు.

print

Post Comment

You May Have Missed