శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత  శ్రీ అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు

 శ్రీశైల దేవస్థానం: శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత  శ్రీ అంకాళమ్మ అమ్మవారికి లోక కల్యాణం కోసం ఈ రోజు (28.05.2021) న  ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించారు.

ప్రతి శుక్రవారం  శ్రీ అంకాళమ్మ అమ్మవారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ ఉంటుంది.

ఇందులో భాగంగా శ్రీ అంకాళమ్మ అమ్మవారికి అభిషేకం, విశేష అర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు చేసారు.

 శ్రీశైల క్షేత్రానికి గ్రామదేవతగా  అంకాళమ్మ ఆలయం ఉంది.ప్రధాన ఆలయానికి ఎదురుగా రహదారికి చివరలో కుడివైపున ఉత్తరముఖంగా ఉంది.

ప్రకృతి శక్తుల  కళలే గ్రామ దేవతలని దేవీ భాగవతంలో ఉంది. ఈ ప్రకృతి అంతా ఆదిపరాశక్తి స్వరూపమేనని మన ఆర్షవాజ్ఞయం చెబుతోంది. దైవశక్తి సమాజంలో ఏదో కొన్ని వర్గాలకు పరిమితం కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని తెలియజెప్పే మన విశిష్ట సంస్కృతి  ఉదాత్త వైఖరికి తార్కాణంగా ఈ గ్రామదేవత ఆరాధనను పేర్కొనవచ్చు.

చతుర్భుజాలను కలిగిన ఈ దేవి నాలుగు చేతులలో కుడివైపున క్రింది నుండి పైకి వరుసగా కత్తి, సర్పంలో చుట్టబడిన ఢమరుకం ఉండగా, ఎడమవైపున పానపాత్ర, త్రిశూలం ఉన్నాయి. కిరీట ముకుటం గల ఈ దేవి వస్త్రాలంకురాలై కర్ణాభరణాలను, కంఠాభరణాలను కలిగి ఉంటుంది.

 కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజ  ఆ తరువాత లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.

అనంతరం పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, విశేష అభిషేకం పూజలను జరిగాయి.

అర్చకస్వాములు కోవిడ్ నిబంధనలతో భౌతికదూరాన్ని పాటిస్తూ అంకాళమ్మ అమ్మవారికి ఈ విశేషార్చనలు నిర్వహించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.