*కర్నూలు ప్రభుత్వ అతిథిగృహంలో ఈ రోజు(24-5-2021) న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, నంద్యాల ఎంపి, పోచ బ్రహ్మానంద రెడ్డి, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి, శాసనసభ్యులు,మేయర్,ఎస్పీ పాల్గొని పిల్లల కోసం కోవిడ్ హెల్ప్ డెస్క్ పోస్టర్లు ఆవిష్కరించారు.*
కర్నూలు, మే 24 :-కరోనా కారణంగా తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాధలైన పిల్లల పునరావాసం కోసం, తల్లిదండ్రులు ఇద్దరూ ఆసుపత్రిలో చేరితే వారి పిల్లల తాత్కాలిక సంరక్షణ కోసం 181, 1098 (చైల్డ్ లైన్) టోల్ ఫ్రీ నెంబర్ లకు సమాచారం ఇవ్వవచ్చని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం స్థానిక గెస్ట్ హౌస్ మీటింగ్ హాల్ లో మహిళలు, పిల్లలు, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిల్లల కోసం కోవిడ్ హెల్ప్ డెస్క్ పోస్టర్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, కర్నూలు, పాణ్యం, కోడుమూరు, నందికొట్కూరు, నంద్యాల ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ జె.సుధాకర్, తోగూరు ఆర్థర్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి, నగర మేయర్ బి.వై.రామయ్య, జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి లు ఆవిష్కరించారు.
పోస్టర్ల ఆవిష్కరణలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు పాల్గొన్నారు.