పట్టువస్త్రాలు , పసుపు కుంకుమ, గాజుల సమర్పణ

 శ్రీశైల దేవస్థానం: కుంభోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం  తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం, జంగాలపల్లె గ్రామానికి చెందిన భక్తబృందం వారు శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు,  అమ్మవారికి గాజులు, పసుపు కుంకుమలను సమర్పించారు.

గాజుల తయారీకి ప్రసిద్ధమైన జంగాలపల్లి భక్త బృందం వారు ప్రతి సంవత్సరం కంచి కామాక్షీదేవికి, మధుర మీనాక్షి దేవికి, తిరుచానురు పద్మావతిదేవి వారికి ఆయా ఉత్సవ సందర్భాలలో వస్త్రాలు, గాజులను, సంప్రదాయబద్ధంగా సమర్పిస్తున్నట్లు తెలియజేశారు.అదే సంప్రదాయ పద్ధతిలో ఈ భక్త బృందం వారు కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సమర్పణ చేశారు.ఈ  కార్యక్రమంలో స్వామివారి ప్రధానార్చకులు  జె. వీరభద్రయ్యస్వామి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి  ఎం. హరిదాసు, స్వామివారి ముఖ్య అర్చకులు శ్రీశైలం స్వామి, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితర సిబ్బందితో పాటు భక్త బృందం తరుపున డా. నయనార్ పొన్నారావు, డా. నయనార్ పృధ్వీ , నైనర్ బాలాజీరావు, జయకుమార్ , కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed