నంద్యాల జిల్లా:.
శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పటిష్ట భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలియజేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిన్నటి దినం అనగా 11 తేదీ బుధవారం సుమారు 63,596 మంది భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది .వీరిలో 14,803 మంది శివ భక్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్పర్శ దర్శనం చేయడం జరిగింది. నేడు మధ్యాహ్నం 12 గంటలకు సుమారు 30,149 మంది దర్శనం చేసుకోగా వారిలో 11,515 మంది శివ భక్తులు ఉన్నారు.
శివరాత్రి పర్వదినం రోజున అనగా 15 వ తేదీన 1,50,000 మంది కన్నా ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉందని వారికి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు శాంతిభద్రతలకు భంగం కలగకుండా సరిపడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది.
స్నానఘట్టాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు బోట్లను గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా బస్సులకు మరియు కార్లకు రింగ్ రోడ్డు వద్ద ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయడం జరిగింది.
భక్తులు ఇతరులకు ఇబ్బంది లేకుండా తమ వాహనాలను పోలీసు వారి సూచనలతో పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే నిలుపుకోవాలని రోడ్డుకు ఇరువైపులా ఎట్టిపరిస్థితులలో వాహనాలు నిలుపరాదని విజ్ఞప్తి చేశారు
