
శ్రీశైల దేవస్థానం:భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక అభిషేక లడ్డు ప్రసాద విక్రయ కేంద్రం శుక్రవారం ప్రారంభమైంది.
. నాలుగు వందల గ్రాముల బరువు గల ఈ లడ్డు ప్రసాదాన్ని భక్తులు రూ.80/- లకు కొనుగోలు
చేయవచ్చు .ప్రస్తుత ఈ ప్రత్యేక లడ్డు ప్రసాదాన్ని శ్రీ స్వామివారి గర్భాలయ అభిషేకం సేవా కర్తలకు అందిస్తారు. భక్తులందరూ కొనుగోలు చేసేందుకు వీలుగా అన్నప్రసాద వితరణ ప్రాంగణములోని ప్రసాద విక్రయ కేంద్ర సముదాయం లో ప్రత్యేక లడ్డు ప్రసాద విక్రయ కౌంటర్ ఏర్పాటు అయింది. ఈ విక్రయ కేంద్రం ప్రారంభం కార్యక్రమం లో కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న , ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సంబంధిత విభాగాధికారులు పాల్గొన్నారు.