కర్నూలు :కర్నూలు నగరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని సంస్కృతి తన గొప్ప వ్యక్తిత్వాన్ని అమలుచేసింది . ఈ రోజు (22-05-2021) న తన వంతు సామాజిక బాధ్యతగా కరోన విపత్తు సహాయ చర్యల కోసం 3 ఆక్సిమీటర్ లు, 30 మాస్క్ లును జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు కు అందించారు. విద్యార్థిని సంస్కృతి చిన్న వయసులో సామాజిక సేవా దృక్పథంతో ఇలా వితరణ చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా విద్యార్థిని ని శ్రీనివాసులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మహబూబ్ భాష పాల్గొన్నారు.