
శ్రీశైల దేవస్థానం: పేరం గోకుల్ నాథ్ రెడ్డి (తాడిపత్రి) మంగళవారం శ్రీశైల దేవస్థానానికి ఒక వెండి పాత్ర, పళ్లెమును విరాళంగా సమర్పించారు. వీటి బరువు 3 కేజీల 860 గ్రాములు.వీటిని దాతలు అమ్మవారి ఆలయ ప్రాంగణములో ఈ ఓ కు అందించారు. ఆలయ కైంకర్యాలలో వినియోగించేందుకు ఈ వెండి వస్తువులను సమర్పించినట్లుగా దాతలు తెలియజేశారు.ఈ సందర్భంగా దాతకు సంబంధిత రశీదు, శ్రీస్వామిఅమ్మవార్లప్రసాదం, శేషవస్త్రాలు అందించారు. కార్యక్రమం లో అమ్మవారి ఆలయ ఉపప్రధాన అర్చకులు వై.విజయ కుమార్, అమ్మవారి ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
*Kumara swamy puuja, Nandheeswara puuja and Bayalu Veerabhadra swaamy puuja performed in the temple by Archaka swaamulu.
*Giri paradhakshina will be held on 16th feb.2022.