
శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) మంగళవారం ఎల్. శ్రీనివాస్ , వారి బృందం, తూర్పుగోదావరి శివనామ సంకీర్తన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం ఈ భజన కార్యక్రమంజరిగింది.
కార్యక్రమం లో వినాయకస్తుతి, పార్వతీనందన, శంభో శంకరా శివశంభో శంకరా, శివనామమే నా గానం, సాంబసదాశివ, పరమశివా ఓ పరమశివా, కైలాసపతే సదాశివా, గిరిజా రమణాదురిత నివారణ, శంకరా సదాశివా సభాపతే, శివశివ భవభవ శరణం, గంగాధర గౌరీ మనోహార మొదలైన పలు భక్తిగీతాలు, అష్టకాలను అచంట లక్ష్మీ శ్రీనివాస్, నూకల యజ్ఞ నారాయణ శర్మ, ఎ.ఎస్.ఆర్ మూర్తి, ఆర్.ఎస్.ఎన్. రాజు, కె.వి. రమణ, వీరపండు, నూకరాజు, వినయ్ కుమార్, గౌరీవర ప్రసాద్ తదితరులు ఆలపించారు.
.