
శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం శ్రావణమాసం సందర్భంగా నిర్వహించిన శివచతుస్సప్తాహ భజనలు భాద్రపద శుక్ల పాడ్యమి అయిన ఈ రోజు (08.09.2021)తో ముగిసాయి. శ్రావణ శుద్ధ పాడ్యమి రోజున (09.08.2021) ఈ అఖండ భజనలు ప్రారంభించారు.
ఈ భజన కార్యక్రమంలో శ్రావణమాసమంతా కూడా నిరంతరంగా రేయింబవళ్ళు అఖండ శివపంచాక్షరి నామభజనను చేసారు.
ఆలయ ప్రాంగణములోని వీరశిరోమండపంలో ఈ విశేషకార్యక్రమం జరిగింది.
కాగా కర్నూలు నగరానికి చెం దిన నాలుగు భజన బృందాలకు, కర్ణాటకకు చెందిన రెండు భజన బృందాలకు ఈ శ్రావణమాస శివభజనలు చేయడానికి అవకాశం కల్పించారు. శ్రీ సుంకులమ్మదేవి భజన మండలి వారు (09.08.2021 నుండి 16.08.2021 వరకు), శ్రీ రామాంజనేయ భజనమండలివారు (14.08.2021 నుండి 21.08.2021 వరకు), శ్రీ చెన్నకేశవ నాటక కళాభజన మండలి రెండు బృందాల వారు (21.08.2021 నుండి 28.09.2021వరకు), శ్రీ గురునిమిషాంబదేవి భజన మండలి కర్నూలు వారు (28.08.2021 నుండి 03.09.2021), మల్లికార్జున భజన సంఘం, సుమ్కేశ్వారాహాల్,
రాయచూరు జిల్లా మరియు ప్రభులింగ సేవా సంఘం, గోపన దేవర హళ్లి, కర్ణాటక రాష్ట్రం వారు ( 01.09.2021 నుండి 08.09.2021 ) ఈ భజనలలో పాల్గొన్నారు.
కాగా పవిత్ర శ్రావణమాసములో శివస్మరణ అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని లోక కల్యాణం కోసం ప్రతీ సంవతర్సరం శ్రావణమాసములో దేవస్థానం అఖండ శివచతుస్సప్తాహ భజనలు నిర్వహిస్తోంది.
*Shakthi Ganapthi Abhishekam and Jwala Veerabhadra swamy puuja performed in Srisaila temple on 8th Sep.2021.