×

శాస్త్రోక్తంగా ముగిసిన శివచతుస్సప్తాహ భజనలు

శాస్త్రోక్తంగా ముగిసిన శివచతుస్సప్తాహ భజనలు

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం శ్రావణమాసం సందర్భంగా నిర్వహించిన శివచతుస్సప్తాహ భజనలు భాద్రపద శుక్ల పాడ్యమి తో ముగిసాయి. శ్రావణ శుద్ధ పాడ్యమి రోజున (29.07.2022) ఈ అఖండ భజనలు ప్రారంభమయ్యాయి.ఈ భజన కార్యక్రమంలో శ్రావణమాసమంతా కూడా నిరంతరంగా రేయింబవళ్ళు అఖండ శివపంచాక్షరి నామభజనను చేసారు.ఆలయ ప్రాంగణములోని వీరశిరోమండపంలో ఈ విశేషకార్యక్రమం జరిగింది.

 కర్నూలు నగరానికి చెందిన అయిదు భజన బృందాలకు,  కర్ణాటకకు చెందిన రెండు భజన బృందాలకు ఈ శ్రావణమాస శివభజనలు చేయడానికి అవకాశం వచ్చింది.

శ్రీసుంకులమ్మదేవి భజన మండలి  [29.07.2022 నుండి 05.08.2022వరకు), శ్రీ రామాంజనేయ భజనమండలి (03.08.2022 నుండి 20.08.22 వరకు), శ్రీ చెన్నకేశవ నాటక కళా భజన మండలి రెండు బృందాలు  (10.08.2022 నుండి 17.08.2022), శ్రీ గురునిమిషాంబదేవి భజన మండలి కర్నూలు  (17.08.2022 నుండి 24.08.2022), మల్లికార్జున భజన సంఘం,సుమ్కేశ్వారాహాల్, రాయచూరు జిల్లా,  ప్రభులింగ సేవా సంఘం గోపన దేవర హళ్లి, కర్ణాటక రాష్ట్రం  (21.08.2022 నుండి 28.08.2022) పాల్గొన్నాయి.

పవిత్ర శ్రావణమాసములో శివస్మరణ అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని లోక కల్యాణం కోసం ప్రతీ సంవతర్సరం శ్రావణమాసములో దేవస్థానం అఖండ శివచతుస్సప్తాహ భజనలు నిర్వహిస్తోంది.

print

Post Comment

You May Have Missed