దసరా పండుగ ఉత్సవాలు – మొదటి రోజు
శిల్పారామం మరియు శ్రీ సాయి నటరాజ అకాడెమి ఆఫ్ కూచిపూడి డాన్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో “గురుభ్యో నమః” నిర్వహించారు. ఈ డాన్స్ ఫెస్టివల్ ని శ్రీ S.V. సత్యనారాయణగారు, వైస్ ఛాన్సలర్. P.S.తెలుగు యూనివర్సిటీ మరియు శ్రీమతి ఆర్. ప్రసన్న రాణి, ప్రముఖ నృత్యకళాకారిణి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రముఖ ఆంధ్ర నాట్యకళాకారులు, శ్రీ కళాకృష్ణగారు తమ నాట్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆంధ్రనాట్య నృత్య పద్ధతిలో పదజావళి అంశాలను ప్రదర్శించారు. పుష్పాంజలి, నీలకంఠమహాదేవ, నవజనార్ధన పారిజాతం తిల్లాన అంశాలు కూడా శ్రీ కళాకృష్ణ శిష్యబృందంవారు అద్భుతంగా ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు.
శ్రీమతి అనుపమమోహన్ గారు కూచిపూడి నృత్యశైలిలో ‘కన్నప్ప చరిత’ మరియు ‘భామాకలాపం’ లేఖను ప్రదర్శించారు. కుమారి నీలిమ, V. నాయర్ మరియు కావ్య, మొదలైనవారు సంయుక్తంగా ‘జయముజయము’, ‘మయగోపాల’, ‘రంజని’, తిల్లానాలు ప్రదర్శించి అందరిని అలరించారు. దీని తరువాత కళాకారులను సన్మానించటంతో కార్యక్రమానికి ముగింపువాక్యం పలికారు