
మచిలీపట్నం:బచ్చుపేట శ్రీ వీరభద్ర స్వామి వారికి శనివారం విశేషంగా అభిషేకాలు, అర్చనలు జరిగాయి . ఆలయ సంప్రదాయ రీతిన ఈ కార్యక్రమాలను అర్చక స్వాములు జరిపించారు . సాయంత్రం భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారి కల్యాణం ఘనఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్లను అర్చక స్వాములు అందంగా తీర్చిన కళ్యాణ వేదిక పైకి తీసుకువచ్చారు. భక్తులు ఆనందంగా స్వాగతం పలికారు. అర్చక స్వాములు చక్కగా కళ్యాణ వేడుకను జరిపించారు.భక్తులు మంగళ నీరాజనాలు పలికారు. అధికారులు,అర్చక స్వాములు,వేద మూర్తులు, కార్యకర్తలు,భక్తుల సమన్వయంతో ఈ దేవాలయ మహోత్సవం ప్రశంసలు అందుకుంది.