శ్రీశైల దేవస్థానం:మే 12వ తేదీ వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా ఆదిశంకరుల వారి జయంతి ఉత్సవం జరుగుతుంది. ఈ జయంతి ఉత్సవంలో భాగంగా పాలధార పంచ ధారల వద్ద గల శంకర మందిరంలో ఉదయం గం.9.30లకు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ విశేష పూజలలో చంద్రమౌళీశ్వరస్వామికి, శారదాదేవికి, శంకరుల వారికి జలాభిషేకం, బిల్వపత్రిపూజ, నీరాజన మంత్ర పుష్పములు, అర్చనలు జరుగనున్నాయి.ఆదిశంకరుల వారికి, శ్రీశైల క్షేత్రానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. శంకరులవారు శ్రీశైలంలోని పాలధార -పంచధార వద్ద కొంతకాలం తపస్సు చేసి ఇక్కడే తమ శివానందలహరి గ్రంథాన్ని రచించారు.