శ్రీ భ్రమరాంబాదేవి అలంకారం-నందివాహనసేవ
శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలు చివరి రోజు మంగళవారం ఉదయం మండపారాధనలు, కలశార్చనలు, జపానుష్ఠానాలు, విశేష కుంకుమార్చనలు, ఉపాంగహవనములు చండీహోమం, రుద్ర హోమం, జయాది హోమాలు నిర్వహించారు.
పూర్ణాహుతి:
ఉత్సవాలలో భాగంగా శ్రీ అమ్మవారి యాగశాలలో చండీయాగ పూర్ణాహుతి, శ్రీ స్వామివారి యాగశాల లో రుద్రయాగపూర్ణాహుతి నిర్వహించారు. తరువాత కలశోద్వాసన కార్యక్రమాలు జరిగాయి.
పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించారు.తరువాత మల్లికాగుండం వద్ద చండీశ్వరస్వామివారికి అవబృథ స్నానం నిర్వహించారు.
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్యస్వామి, శ్రీమతి ఎం. విజయలక్ష్మి, మేరాజోత్ హనుమంతునాయక్, ఓ. మధుసూదన్రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అధ్యాపక (స్థానాచార్యులు), అర్చకస్వాములు, వేదపండితులు, ఆలయ పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ భ్రమరాంబాదేవి అలంకారం:
అలంకారాలలో భాగంగా ఈ సాయంత్రం నిజాలంకరణ చేసారు. శ్రీభ్రమరాంబాదేవిస్వరూపంలో
అష్టభుజాలు కలిగిన ఈ దేవి శూలం, బాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిఘ మొదలైన ఆయుధాలను ధరించి దర్శనమిచ్చారు.
:
ఈ ఉత్సవాలలో శ్రీస్వామి అమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ సాయంత్రం నందివాహనసేవ కార్యక్రమం జరిగింది.
ఈ వాహనసేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, నందివాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలను జరిపారు.
శమీపూజ:
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని శమీ వృక్షానికి శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపారు.
ఈ కార్యక్రమం లో భాగంగా ముందుగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను నందివాహనముపై శమీవృక్షము వద్దకు తోడ్కొని వచ్చారు. తరువాత శమీవృక్షము వద్ద ప్రత్యేక పూజలు జరిపారు.
Post Comment