
శ్రీశైల దేవస్థానం:దేవస్థానంలో భద్రతా పరమైన అంశాలకు సంబంధించి శనివారం దేవస్థాన కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆక్టోపస్ అధికారులు భద్రతా చర్యల గురించి పలు అంశాలను వివరించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ఆక్టోపస్ విభాగపు డి.యస్.పీ.లు ఐ. తిరుపతయ్య, కె. సంకురయ్య, పలువురు ఆక్టోపస్ అధికారులు, స్థానిక తహసిల్దారు శ్రీనివాసులు, పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. ప్రసాదరావు, స్థానిక స్పెషల్ ప్రొటెక్షన్ అధికారులు, స్థానిక అగ్నిమాపక శాఖ అధికారులు, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి, స్థానిక విద్యుత్ శాఖ అధికారులు తదితర సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు.
అదేవిధంగా దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నరసింహారెడ్డి, భద్రతా విభాగపు పర్యవేక్షకులు , ఇంఛార్జ్ భద్రతా అధికారి ఎం.మల్లికార్జున, దేవస్థాన అన్నీ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో ముందుగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవస్థానంలో భద్రతా చర్యల గురించి పి.పి.టి. ద్వారా వివరించారు.
దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఆర్ముడు గార్డ్స్ స్పెషల్, ప్రొటెక్షన్ ఫోర్స్, హోమ్ గార్డ్స్ ,దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వివరాలను వివరించారు. తరువాత దేవస్థానంలో వినియోగిస్తున్న వాకీ టాకీలు, డోర్ ఫ్రేమ్స్ డిటెక్టర్లు మొదలైనవాటిని తెలియజేశారు. అదేవిధంగా దేవస్థానంలో క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్ల నిర్వహణ, మహా శివరాత్రి, ఉగాది ఉత్సవాలలో ఏర్పాటు చేయనున్న అదనపు క్యూ లైన్లు దేవస్థానం పరిధిలోని పార్కింగ్ ప్రదేశాలు మొదలైన వాటిని వివరించారు.
తరువాత ఆక్టోపస్ డి.యస్.పి. ఐ.తిరుపతయ్య మాట్లాడుతూ రాష్ట్ర ఆక్టోపస్ విభాగంవారి విధులు, అనుకోని సంఘటనలు జరిగినపుడు ఆక్టోపస్ సిబ్బంది చేపట్టే చర్యలు, దేవస్థానంలో భద్రతకు సంబంధించిన చర్యలు మొదలైన అంశాలను పి.పి.టి. ద్వారా వివరించారు.
అనంతరం ఆక్టోపస్ డి.యస్.పి. కె. సంకురయ్య మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు భద్రతా పరంగా చేపట్టాల్సిన తక్షిణ చర్యల గురించి వివరించారు. అటువంటి సమయాలలో దేవస్థానం, స్థానిక పోలీస్, స్థానిక రెవెన్యూ, స్థానిక వైద్య ఆరోగ్య శాఖ, స్థానిక విద్యుత్ శాఖ, టెలీ కమ్యూను కేషన్లు మొదలైన అన్నీ విభాలు పరస్పర సమన్వయంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలన్నారు.
తర్వాత స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.ప్రసాదరావు మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్తల గురించి వివరించారు.
కాగా ఈ రోజు ఆక్టోపస్ బృందంవారు భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన మాక్ డ్రిల్లును నిర్వహించారు.