
శ్రీశైల దేవస్థానం: ఉగాది ఉత్సవాలు రెండో రోజు ఆదివారం విశేషాలు
ఈ రోజు ఉదయం 8 గంటలకు చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చనలు, జపానుష్ఠానములు జరిగాయి.
• ఉత్సవాలలో భాగంగా లోక కల్యాణార్థం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు జరిపారు.
• శ్రీస్వామివారికి విశేషార్చనలు, అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు జరిపారు.
• రాత్రి 7.00గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు కైలాస వాహనం సేవ నిర్వహించారు.
• శ్రీ అమ్మవారికి మహాదుర్గ అలంకారం చేసారు.
• ఈ రోజు రాత్రి గ్రామోత్సవం – గ్రామోత్సవంలో పలు జానపద కళారూపాల ప్రదర్శనలు ప్రత్యేకం.
- ఈ ఓ పెద్దిరాజు పర్యవేక్షణలో అధికారులు , సిబ్బంది చక్కని సమన్వయం చేసారు. భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.