ప్రజాపాలన- ప్రజా విజావిజయోత్సవాల  ముగింపు వేడుకల వివరాలు

హైదరాబాద్ డిసెంబర్ 06 ::  ప్రజాపాలన- ప్రజా విజావిజయోత్సవాల  ముగింపు వేడుకలను డిసెంబర్ 07 వ తేది నుండి 09 వ తేది వరకు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలలో ప్రజలు కూడా పాలు పంచుకుని సంబరాలు జరుపుకునే విధంగా కార్యక్రమాల రూప కల్పన చేశారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, HMDA గ్రౌండ్స్ వేదికగా పలు సంగీత, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ప్రముఖ సంగీత కళాకారులు వందే మాతరం శ్రీనివాస్, రాహుల్ సిప్లీగంజ్, తమన్ ల సంగీత కచేరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. సందర్శకుల కోసం సాంస్కృతిక,ఫుడ్, హస్తకళల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.  ఎన్టీఆర్ మార్గ్ వద్ద బాణాసంచా ప్రదర్శన, ట్యాంక్ బండ్ వద్ద డ్రోన్ షో, భారత వాయు దళం చే ఎయిర్ షో ఆహుతులను ఆకట్టుకోనున్నాయి. పూర్తి కార్యక్రమాల వివరాలు తేదీల వారీగా ఈ క్రింది విధంగా ఉన్నాయి.

   

ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకల వివరాలు

 

క్రమ సంఖ్య తేదీ /సమయం కార్యక్రమం వేదిక
1. 07.12.2024 1.సాంస్కృతిక కార్యక్రమాలు – మూడు వేదికలు (5 – 9PM) నెక్లెస్ రోడ్
2.సంగీత కచేరీ – శ్రీ వందేమాతరం శ్రీనివాస్ (7 – 8.30 PM) HMDA గ్రౌండ్స్ IMAX
3.పుడ్ స్టాల్స్, హ్యాండీక్రాప్ట్ స్టాల్స్, కల్చరల్ స్టాల్స్ ఉదయం – రాత్రి వరకు
నగరంలో వీధి దీపాల (GHMC ప్రాంతం) అలంకరణ రాత్రి సమయం
2. 08.12.2024 1. భారత వాయు దళం చే ఎయిర్ షో ట్యాంక్ బండ్ వద్ద
2.సంగీత కచేరీ – శ్రీ రాహుల్ సిప్లిగంజ్ (7PM to 8.30 PM) HMDA గ్రౌండ్స్ IMAX
3.సాంస్కృతిక కార్యక్రమాలు – (5 PM to 9 PM) 3 వేదికలు – నెక్లెస్ రోడ్
4.పుడ్ స్టాల్స్, హ్యాండీక్రాప్ట్ స్టాల్స్, కల్చరల్ స్టాల్స్ ఉదయం – రాత్రి వరకు
5.నగరంలో వీధి దీపాల (GHMC ప్రాంతం) అలంకరణ రాత్రి సమయం
3. 09.12.2024 1.తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ (5.00 PM) సచివాలయంలో
2.బహిరంగ సభ – గౌరవ ముఖ్యమంత్రి (5PM to 5.45PM) సచివాలయంలో
3. డ్రోన్ షో (5.45 PM to 6 PM)
4. బాణసంచా (6.05 PM to 6.20 PM)
5. గౌరవ ముఖ్యమంత్రి  – కల్చరల్ వేదికకు చేరుకుంటారు. (6.10 PM)
6. సంగీత కచేరీ – శ్రీ ఎస్ తమన్ (7 PM to 8.30 PM HMDA గ్రౌండ్స్ IMAX
7. సాంస్కృతిక కార్యక్రమాలు – (5 PM to 9 PM)
8. పుడ్ స్టాల్స్, హ్యాండీక్రాప్ట్ స్టాల్స్, కల్చరల్ స్టాల్స్ ఉదయం – రాత్రి వరకు
9. నగరంలో వీధి దీపాల (GHMC ప్రాంతం) అలంకరణ రాత్రి సమయం
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.