శ్రీశైల దేవస్థానం:పర్యావరణ పరిరక్షణకు , క్షేత్రాన్ని మరింతగా సుందరీకరించేందుకు శ్రీశైల క్షేత్ర పరిధిలో పలుచోట్ల మరిన్ని మొక్కలు నాటుతున్నారు.ముఖ్యంగా వలయ రహదారికి ఇరువైపులా, ఆరుబయలు ప్రదేశాలలో, ఉద్యానవనాలలో, ఆలయ ప్రాంగణములో ఈ మొక్కలను నాటే కార్యక్రమాన్ని దేవస్థానం చేపట్టింది.
ఇందులో భాగంగా సోమవారం ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులం వద్ద కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు జమ్మి, బిల్వం మొదలైన దేవతా వృక్షాలను నాటారు.ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ నాటిన మొక్కల సం రక్షణపట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉద్యానవన అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా మొక్కలకు నీళ్ళు పోస్తుండాలన్నారు. క్షేత్రంలో మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు అనువైన చోట్ల మరిన్ని బిల్వం, కదంబం, ఉసిరి, మేడి తదితర దేవతా మొక్కలు నాటాలన్నారు.
సహాయ కార్యనిర్వహణాధికారి బి. మల్లికార్జునరెడ్డి, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, ఉద్యానవన విభాగపు విశ్రాంత సహాయ సంచాలకులు ఈశ్వరరెడ్డి, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.