×

శ్రీశైలక్షేత్రం సాక్షాత్తు ఇలలో వెలసిన కైలాసం – సామవేదం

శ్రీశైలక్షేత్రం సాక్షాత్తు ఇలలో వెలసిన కైలాసం – సామవేదం

 శ్రీశైల దేవస్థానం:ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం మూడు రోజులపాటు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ వారి దివ్య ప్రవచనాలను ఏర్పాటు చేసింది.

‘శివనామ మహిమ’ అంశంపై ఏర్పాటు చేసిన  ఈ ప్రవచనాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి జ్యోతిప్రజ్వలన జరిగింది. తరువాత సామవేదం  తమ ప్రవచాన్ని ప్రారంభించారు. సామవేదం  మాట్లాడుతూ శ్రీశైలక్షేత్రం సాక్షాత్తు ఇలలో వెలసిన కైలాసమని అన్నారు. మహాభారతం శ్రీశైలక్షేత్రాన్ని దివ్యస్థలంగానే కాకుండా పవిత్రతీర్థంగా పేర్కొనదన్నారు. శ్రీశైలక్షేత్రంలో అణువణువునా దివ్యత్వం వ్యాపించి ఉందన్నారు.

శివనామ స్వరూపుడైన ఆ పరమశివుడు వివిధ ప్రదేశాలలో ఆయా సందర్భాలలో తన ఆత్మజ్యోతి స్వరూపంతో స్వయంగా వెలిశాడని, అలా వ్యక్తమైనవే ద్వాదశ జ్యోతిర్లింగాలని చెప్పారు. సృష్టికి పూర్వం ఉన్న అనాది పరంజ్యోతిని “శివ” అని వేదం చెబుతోందన్నారు. ఈ శివజ్యోతి నుండి ప్రసరించిన అనంత శక్తుల వెలుగులే ఈ విశ్వంగా విస్తరించాయని పేర్కొన్నారు.ఈ విశ్వకాంతి వృత్తానికి కేంద్రంగా వున్న ఆ పరమాత్మ స్వరూపాన్నే మన మహర్షులు శివస్వరూపంగా భావిన్చారన్నారు.సనాతనధర్మం, వైదిక ఆచారాలకు సంబంధించిన పలు అంశాలు ప్రస్తావించారు.

print

Post Comment

You May Have Missed