శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్. లవన్న
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా నియమితులైన ఎస్. లవన్న ఈ రోజు (27.08.2021) న ఉదయం పరిపాలనా భవనం లో అధికార బాధ్యతలను స్వీకరించారు.
పూర్వ కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామరావు నుండి ఎస్. లవన్న అధికార బాధ్యతలను స్వీకరించారు.
కాగా ఉద్యోగ బాధ్యతల స్వీకరణకు ముందు ఎస్. లవన్న ఆలయం లో శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజాదికాలను జరిపించుకున్నారు.
అధికార బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న మాట్లాడుతూ పరమేశ్వరుని అనుగ్రహంతోనే తనకు కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించిందన్నారు. శ్రీస్వామిఅమ్మవార్లను సేవించుకునే భాగ్యం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు.
కార్యనిర్వహణాధికారి బాధ్యతల ద్వారా అటు స్వామి అమ్మవార్లను, ఇటు భక్తులను సేవించుకునే అవకాశం తనకు లభించిందన్నారు.గతంలో తాను వివిధ హోదాలలో రెవిన్యూ డివిజనల్ అధికారిగా, మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా బాధ్యతలను నిర్వహించామని చెప్పారు.
ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అర్చకస్వాములు, దేవస్థానం సిబ్బంది మొదలైన వారి సహకారం తో శ్రీశైలక్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న పేర్కొన్నారు.ముఖ్యంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు, క్షేత్ర సుందరీకరణలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Post Comment