శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం శ్రీమతి వి. నాగరాజ్యలక్ష్మి , వారి బృందం, గుంటూరు వారు “ శివలీలలు” భక్తి సాహిత్య రూపకం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భక్తి సాహిత్య రూపకం కార్యక్రమం జరిగింది।
ఈ కార్యక్రమం లో డా. నాగరాజ్యలక్ష్మి, డా. సత్యవతి, సీతామహాలక్ష్మిలు శివలీలలపై భక్తి సాహిత్య రూపకాన్ని అందించారు.
ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
