×

తలపాగా వస్త్రం, రుద్రాక్షల విక్రయం ప్రారంభం

తలపాగా వస్త్రం, రుద్రాక్షల విక్రయం ప్రారంభం

 శ్రీశైల దేవస్థానం:శ్రీ స్వామివారి తలపాగా వస్త్రం,  రుద్రాక్షలను భక్తులు కొనుగోలు చేసేందుకు వీలుగా విక్రయానికి అందుబాటులో ఉంచారు.ఆలయ ప్రాంగణములోని కైలాస కంకణాల విక్రయ కేంద్రంలో ఈ పాగావస్త్రం , రుద్రాక్షల విక్రయాలు సోమవారం ప్రారంభించారు.

శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపి ఈ విక్రయాలు ప్రారంభించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి  ఎస్. లవన్న మొదటగా వీటిని స్వయంగా కొనుగోలు చేసి విక్రయాలను ప్రారంభించారు.

 ప్రతి  సంవత్సరం మహాశివరాత్రి రోజున ఆలయంలో పాగాలంకరణ చేయడం ఆనవాయితి. మన వివాహాలలో పెండ్లికుమారిని తలపాగాను చుట్టడం ఒక సంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైలాయలంలో పాగాలంకరణ పేరుతో ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పాగాను శ్రీస్వామివారి గర్భాలయ విమానగోపురం శిఖరం నుండి ముఖమండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ అలంకరిస్తారు.

స్వామివారి ఈ తలపాగా వస్త్రాన్ని,  పంచముఖ రుద్రాక్షలు (3 నెంబర్లు) కలిపి ఒక్కింటికి రూ.150/-ల చొప్పున శ్రీస్వామివారి తలపాగా వస్త్రం పేరుతో భక్తుల సౌకర్యార్థం విక్రయానికి అందుబాటులో ఉంచారు.

 కేవలం రుద్రాక్షలు మాత్రమే కోరుకునే భక్తుల సౌకర్యార్థం మూడు ముఖాల రుద్రాక్షలు (3 నెంబర్లు) కలిగిన పాకెట్ను ఒక్కింటికి రూ.50/-లతో భక్తులకు అందుబాటులో ఉంచారు.

ఈ కార్యక్రమం లో స్వామివారి ఆలయ ప్రధానార్చకులు శివప్రసాద్స్వమి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, స్వామివారి ఆలయ ఉపప్రధానార్చకులు శివశంకరయ్యస్వామి, ఆలయ కార్యాలయ పర్యవేక్షకురాలు పి. దేవిక, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

*Nandeeswara Pooja Paroksha seva, Sahasra Deeparchana Seva, Vendi Rathotsava Seva  performed in the temple.

*గోసంరక్షణ పథకానికి విరాళంగా  రూ. 1,08,000/-లను శ్రీమతి నెల్లూరు అరుంధతి, నెల్లూరు సోమవారం నాడు దేవస్థానం   పర్యవేక్షకులు ఎ. నాగరాజుకు అందించారు.

*  దేవి వైభవం పై ప్రవచనం:

ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం)  వి.గణేష్, జిల్లెళ్ళమూడి  దేవి వైభవం పై ప్రవచనం  చేసారు.

print

Post Comment

You May Have Missed