×

కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించండి-డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి

కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించండి-డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి

*ఈ రోజు సాయంత్రం (18-09-2021)న  స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు – 2021 కౌంటింగ్ పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జనరల్ అబ్జర్వర్,  ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ విసి మరియు ఎండి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి .,జిల్లా కలెక్టర్,  జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావు

జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ,జాయింట్‌ కలెక్టర్‌ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి , జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య , జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు , జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ పర్యవేక్షణ జిల్లా ఇన్చార్జి అధికారి వై శంకర్ నాయక్ , డి ఆర్ ఓ పుల్లయ్య, జెడ్పి సిఈఓ వెంకటసుబ్బయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*

*జనరల్ అబ్సర్వర్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ విసి,  ఎండి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి :-

కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభంకావాలి :-

ప్రతి రెండు గంటలకు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకోండి :-

జిల్లా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావు :-

కర్నూలు, సెప్టెంబర్ 18 :-రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేసి, ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జనరల్ అబ్సర్వర్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ విసి మరియు ఎండి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు.

శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు – 2021 కౌంటింగ్ పై జనరల్ అబ్జర్వర్ మరియు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ విసి మరియు ఎండి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావులు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్‌ కలెక్టర్‌ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ పర్యవేక్షణ జిల్లా ఇన్చార్జి అధికారి వై శంకర్ నాయక్, డి ఆర్ ఓ పుల్లయ్య, జెడ్పి సిఈఓ వెంకటసుబ్బయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జనరల్ అబ్సర్వర్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ విసి మరియు ఎండి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ….జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల నుంచి రిపోర్టింగ్, సమాచారం కోసం కోసం నియమించబడ్డ 14 మంది కమ్యూనికేషన్ లైజనింగ్ ఆఫీసర్లు కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఓట్ల లెక్కింపు చేసే సిబ్బంది ఉదయం ఆరు గంటలకు హాజరయ్యార లేదా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిందా లేదా మీకు కేటాయించిన మూడు లేక నాలుగు మండలాలు సంబంధించిన రిపోర్ట్ తేప్పించుకోవాలన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను ఎక్కడ నుంచి ఎక్కడికి పంపించాలో రూట్ మ్యాప్ తయారు చేసుకొని కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా కౌంటింగ్ సిబ్బందికి బస్సు సౌకర్యం కల్పించి ఇంటికి క్షేమంగా చేరుకునేలా చర్యలు చేపట్టాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ…. ప్రతి కౌంటింగ్ సెంటర్ లో అంబులెన్స్ తో పాటు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కౌంటింగ్ సెంటర్ లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిరంత‌రం ఉండేలా చూడాల‌ని ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ ఈను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కరెంటు పోతేనే కౌంటింగ్ సెంటర్ లో ఎలక్ట్రికల్ ఏఈలు అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో వినియోగించేందుకు వీలుగా జ‌న‌రేట‌ర్ల‌ను సిద్దంగా ఉంచాల‌న్నారు. స్ట్రాంగ్ రూముల‌ నుంచి కౌంటింగ్ కేంద్రాల‌వ‌ర‌కూ వెళ్లే మార్గాల్లో వీడియోగ్రఫీ చేయించాలన్నారు. 14 మంది కమ్యూనికేషన్ లైజనింగ్ ఆఫీసర్లు ప్రతి రెండు గంటలకు ఒకసారి కౌంటింగ్ రిజల్ట్ రిపోర్టులు తెప్పించుకొని ఆ రిపోర్టులను జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)కు సమర్పించాలన్నారు.

ఎంపీడీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ :-

జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా సజావుగా నిర్వహించి విజయవంతం చేయాలని జనరల్ అబ్సర్వర్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ విసి మరియు ఎండి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఐడి కార్డులు ఇచ్చారా, కోవిడ్ టెస్ట్ చేయించారా, ఎంతమందికి చేయించారు వంటి వివరాలను ఎంపీడీఓలను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కేంద్రాలలో సరిపడినన్ని టేబుల్స్, అవసరమైన మెటీరియల్స్ సిద్ధంగా ఉంచుకుని, ఉదయమే రిహార్సల్స్ చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ లో ఆర్ ఓలు అత్యంత కీలకమని, చాలా జాగ్రత్తగా కౌంటింగ్ పక్రియను పూర్తి చేయాలన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్‌ కలెక్టర్‌ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, జెడ్పి సిఈఓ వెంకటసుబ్బయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed