×

పనులు సకాలంలో, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలి-రెడ్డివారి చక్రపాణిరెడ్డి

పనులు సకాలంలో, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలి-రెడ్డివారి చక్రపాణిరెడ్డి

 శ్రీశైల దేవస్థానం: ధర్మకర్తల మండలి అధ్యక్షులు  రెడ్డివారి చక్రపాణిరెడ్డి గురువారం  దేవస్థానం  అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు.కార్యాలయ భవనం లోని సమావేశం మందిరంలో జరిగిన సమీక్షలో ముందుగా కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

 ఇటీవల జరిగిన ధర్మకర్తల మండలి సమావేశాలలో భక్తులు సౌకర్యాలు, క్షేత్రాభివృద్ధికి సంబంధించి ధర్మకర్తల మండలి వారు పలు తీర్మానాలను ఆమోదించారు. ఆయా తీర్మానాలకు అనుగుణంగా తీసుకున్న  చర్యలను ధర్మకర్తల మండలి అధ్యక్షులు సమీక్షించారు.

 ధర్మకర్తల మండలి అధ్యక్షులు  మాట్లాడుతూ అన్ని పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అదేవిధంగా పనులలో కూడా పూర్తి నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు.

 త్వరలో గణేశ సదనం సమీపంలో నిర్మించనున్న 200 గదుల వసతి సదుపాయ నిర్మాణం, క్షేత్రపరిధిలో ట్రాఫిక్ , పార్కింగు సమస్యలను అధిగమించేందుకు టోల్ గేట్, నంది సర్కిల్ మొదలైనచోట్ల ఫ్రీకాస్ట్ సెంటర్ డివైడ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు రాజుల సత్రం కూడలి నుండి సిద్ధిరామప్ప పాదాల వరకు బ్రిడ్జి ఏర్పాటు, మల్లికార్జునసదన్ నుండి టోల్ గేట్ వరకు , టోల్ గేట్ నుంచి రామయ్యటర్నింగు వరకు ఫ్లై ఓవరు ఏర్పాటు ప్రతిపాదన, సిద్ధిరామప్ప వంపు వద్ద ( జంక్షన్ వద్ద) రహదారి విస్తరణ, క్షేత్రభద్రతకు సంబంధించి టూరిస్ట్ బస్టాండ్, ఫిలిగ్రీమ్ షెడ్లు మొదలైన చోట్ల మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాట్లు, పలు ఉద్యానవనాలలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఫైబర్ తో చేయబడిన బొమ్మల ఏర్పాటు, పార్కింగు ప్రదేశాలలో హైమాస్ట్ లైటింగ్ టవరు ఏర్పాటు, శ్రీశైలంలోని చెక్ డ్యాంకు కంచె ఏర్పాటు, పాతాళగంగ మెట్ల వద్ద శౌచాలయాల ఏర్పాటు, రుద్రపార్కులో వ్యూ పాయింట్ ఏర్పాటు, శిఖరేశ్వరం వద్ద ఆర్చిగేటు నిర్మాణం, శిఖరేశ్వరాలయంలోపల అభివృద్ధి పనులు మొదలైన వాటి గురించి సమీక్షించారు.

సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి ఎం. విజయలక్ష్మి , మేరాజోత్ హనుమంత్ నాయక్, , గురుమహాంతు ఉమామహేష్, ప్రత్యేక ఆహ్వానితులు  తన్నీరు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

 ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు వి. రామకృష్ణ, మురళీధరరెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధరప్రసాద్, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పర్యవేక్షకులు రవికుమార్,  ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ , పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed