
*కర్నూలు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఈ రోజు (11-8-2021) న ప్యూరిఫికేషన్ ల్యాండ్ రికార్డ్ పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్.*
కర్నూలు, ఆగస్టు 11 :-పిఓఎల్ ఆర్ – రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ, రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి ఆదేశించారు.
బుధవారం స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పిఓఎల్ ఆర్ – రీ సర్వే పై నంద్యాల సబ్ కలెక్టర్, ఆర్ డిఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ , రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ…. పిఓఎల్ ఆర్ -రీ సర్వేకి సంబంధించి నంద్యాల 59 గ్రామాలు, ఆదోని 54, కర్నూలు 46, మొత్తం జిల్లాలోని 159 గ్రామాలలో డ్రోన్ సర్వే సెలక్ట్ చేశామని…ఆ గ్రామాల్లో భూ రికార్డుల స్వచ్చికరణ ఈనెల 28లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఇందులో గ్రామ సరిహద్దులు గుర్తించడం, గ్రామ కంట్రోలింగ్ పాయింట్లు గుర్తించడం, గ్రామ కంఠం హద్దులను గుర్తించి రాళ్లను పాతి తెల్లని రంగు వేయాలన్నారు. 1 నుంచి 5 ప్రొఫార్ ల వరకు పూర్తి చేసిన వాటిని ఆయా నియోజకవర్గాల క్వాలిటీ చెక్ ఆఫీసర్లు (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు) వెరిఫై చేయాలని ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లో పి ఓ ఎల్ ఆర్ – రీ సర్వే పర్యవేక్షించేందుకు నియమించిన క్వాలిటీ చెక్ ఆఫీసర్ ల (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు) ప్రగతిని జాయింట్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పిఓఎల్ ఆర్ -రీ సర్వేకి సంబంధించి 1 నుంచి 5 ప్రొఫార్ లు ఏ స్టేజ్ లో ఎందుకు పెండింగ్ ఉన్నాయి వంటి ప్రోగ్రెస్ పై జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు.
కార్యక్రమంలో నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కోనేరు రంగారావు కమిటీ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు, కర్నూలు, ఆదోని ఆర్ డిఓలు హరి ప్రసాద్, రామకృష్ణారెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి హరికృష్ణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.