శ్రీశైల దేవస్థానం: కార్తిక మాసోత్సవాల సన్నాహక సమావేశం:
* నవంబరు 2 నుంచి డిసెంబరు 1 వరకు కార్తిక మాసోత్సవాలు
* భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
* ప్రాతాళగంగవద్ద పుణ్యస్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు
* కార్తిక మాసమంతా గర్భాలయ అభిషేకాలు నిలుపుదల
* కార్తిక మాసంలోని సోమవారాలలో లక్ష దీపోత్సవం – పుష్కరిణి హారతి
* కార్తిక పౌర్ణమి రోజున పుణ్యనదీహారతి, జ్వాలా తోరణం, లక్ష దీపోత్సవం — పుష్కరిణి హారతి,
నవంబరు 2వ తేదీ నుంచి డిసెంబరు 1వతేదీ వరకు కార్తిక మాసోత్సవాలు నిర్వహించనున్నారు.
ఈ కార్తిక మాసోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి సోమవారం పరిపాలనా భవనంలోని
సమావేశ మందిరంలో సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్. రమణమ్మ, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అధ్యాపక, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితరులు
పాల్గొన్నారు.
అదేవిధంగా ఆత్మకూరు డి.ఎస్.పి ఆర్.రామాంజీనాయక్, పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు
జి. ప్రసాదరావు , జి. చంద్రబాబు కూడా పాల్గొన్నారు.
భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం,
ఆలయ వేళలు, శ్రీస్వామిఅమ్మవార్ల ఆర్జిత సేవలు, క్యూలైన్ల నిర్వహణ, రద్దీ క్రమబద్దీకరణ, ట్రాఫిక్
క్రమబద్దీకరణ, పారిశుద్ధ్యం, వాహనాల పార్మింగ్, కార్తిక సోమవారాలు, లక్షదీపోత్సవం, పుష్కరిణి
హారతి, కార్తిక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం, పుణ్యనదీహారతి ఏర్పాట్లు, కార్తికమాసంలో
ఆకాశదీపం ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ మొదలైన అంశాలను గురించి సుదీర్హంగా
చర్చించారు.
సమావేశంలో ముందుగా కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు మాట్లాడుతూ కార్తికమాసంలో
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని విభాగాలను
ఆదేశించారు.ఆయా ఏర్పాట్లన్నీ కూడా ముందస్తుగా పూర్తి కావాలని అన్నారు. ఈ నెల 31వ తేదీనాటికంతా
ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలని అన్నివిభాగాల అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా కార్తిక సోమవారాలు, కార్తికపౌర్ణమి, శుద్ధ, బహుళ ఏకాదశులు, ప్రభుత్వ
సెలవు రోజులలో భక్తులరద్ద్టీ అధికంగా ఉంటుందని చెబుతూ రద్దీకనుగుణంగా ఆయా ఏర్పాట్లన్నీ
పకడ్బందీగా చేపట్టాలన్నారు. పాతాళగంగవద్ద శౌచాలయాలకు, స్త్రీలు దుస్తులు మార్చుకునే
గదులకు , పాతాళగంగ మెట్లమార్గం మొదలైనచోట్ల అవసరమైన మరమ్మతులను వెంటనే
చేపట్టాలన్నారు. గంగాభవానీ స్నాన ఘట్టాలకు కూడా అవసరమైన మరమ్మతులను
చేయించాలన్నారు.
సమావేశంలో ఈ క్రింది అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.
సిబ్బందికి ప్రత్యేక విధులు :
భక్తులకు సేవలు అందించేందుకుగాను కార్తిక మాసంలో రద్దీరోజులలో కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక
విధులు కేటాయింపు.
దర్శనం ఏర్పాట్లు :
వేకువజామున గం.3.00లకు ఆలయ ద్వారాలు తెరచి, ప్రాతఃకాల పూజల అనంతరం వేకువజామున
గం. 4.30ల నుంచి సాయంకాలం గం. 4.00ల వరకు దర్శనాలు . అదేవిధంగా
తిరిగి సాయంత్రం గం. 5.30ల నుంచి రాత్రి గం. 11.00ల వరకు దర్శనాలు కొనసాగుతాయి.
ఆర్జితసేవలు :
కార్తిక మాసమంతా కూడా శ్రీస్వామివారి గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల.
సర్వదర్శనం క్యూలైన్ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తికమాస
శని,ఆది,సోమవారాలు, పౌర్ణమి మొదలైన పర్వదినాలు మినహా ఇతర సాధారణ రోజులలో
సామూహిక అభిషేకాలు పరిమితం.
రుద్రహోమం, మృత్యుంజయ హోమం రెండు విడతలుగా వుంటాయి.
చండీహోమం యథావిధిగా ఒక విడతగా నిర్వహిస్తారు.
రద్దీరోజులలో అమ్మవారి అంతరాలయములో జరిపించే కుంకుమార్చనలు, అమ్మవారి ఆలయ
ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో జరుపుతారు.
అన్నప్రసాదాల వితరణ :
భక్తులకు అన్నదాన భవనములో ఉదయం గం.10.45ల నుండి అన్నప్రసాదాల వితరణ
.
సాయంత్రం గం. 6.30ల నుంచి భక్తులకు అల్పాహారం.
క్యూకాంప్లెక్స్‌లో దర్శనానికి వేచిఉండే భక్తులకు మంచి నీరు,బిస్కెట్లు అల్పాహారం
.
లడ్డు ప్రసాదాలు :
కార్తిక మాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం
చేస్తారు.
కార్తిక మాసమంతా కూడా అదనపు ప్రసాద విక్రయ కౌంటర్లు ఏర్పాటు . అదనంగా
4 కౌంటర్లను ఏర్పాటు చేసి మొత్తం 10 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు.
పాతాళగంగవద్ద ఏర్పాట్లు:
కార్తిక మాసములో భక్తులు పుణ్యస్నానాలకు ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా పాతాళగంగ వద్ద
అవసరమైన అన్ని ఏర్పాట్లు.
పాతాళగంగవద్ద శౌచాలయాల నిర్వహణ, పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
అదేవిధంగా అదనపు లైటింగ్ ఏర్పాట్లు చేస్తారు.
భద్రతా చర్యలలో భాగంగా పాతాళగంగ వద్ద ఈత నిపుణులను కూడా ఏర్పాటు చేస్తారు.
కేశఖండనశాలలో ఏర్పాట్లు:
భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు కేశఖండనశాలలో ఆయా ఏర్పాట్లు వుంటాయి.
ముఖ్యంగా భక్తులరద్దీకనుగుణంగా కేశఖండనశాల వేళల నిర్ణయం.
సూచిక బోర్డుల ఏర్పాట్లు :
భక్తులు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా అవసరమైన అన్ని ప్రదేశాలలో తగినన్నీ
సూచికబోర్జ్డులు ఏర్పాటు.
కార్తికమాసం సందర్భంగా శివచతుస్సప్తాహ భజనలు :
లోకకల్యాణం కోసం కార్తికమాసంలో అఖండ శివభజనలు.
కార్తికదీపారాధన:
భక్తులు కార్తికదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడ వీధీ ప్రత్యేక ఏర్పాట్లు
.
ఆలయ ముందు భాగంలోని రహదారికి ఇరువైపులా కూడా ( గంగాధరమండపం
ముందుభాగం నుండి) దీపారాధనకు ఏర్పాట్లు.
ఉత్తరమాడవీధిలోనూ గంగాధరమండపం ముందుభాగంలోని రహదారికి ఇరువైపులా
దీపారాధనకు వీలుగా ఉసిరికచెట్ల కుండీలను ఏర్పాటు .
పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి:
కార్తికసోమవారాలు , పౌర్ణమిరోజున ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం ,
పుష్కరిణి హారతి కార్యక్రమాలు.
పుణ్యనదీ హారతి:
కార్తిక పౌర్ణమి, నవంబరు 15 తేదీన సాయంకాలం కృష్ణవేణినదీమతల్లికి పుణ్యనదీహారతి కార్యక్రమం
.ఈ సందర్భంగా పాతాళగంగ వద్ద ఉన్న కృష్ణవేణీ విగ్రహానికి పూజాదికాలు, సారె సమర్పణ
.అదేవిధంగా గంగాధరమండపం వద్ద జ్వాలాతోరణ కార్యక్రమం.
సాంస్కృతిక కార్యక్రమాలు:
ఆలయ నిత్యకళావేదిక వద్ద ప్రతిరోజు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు.
లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి రోజులలో పుష్కరిణి వద్ద ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు
చేస్తారని ఈ ఓ తెలిపారు.