శ్రీశైల క్షేత్ర పరిధి  సరిహద్దులు గుర్తించేందుకు  సర్వేపై నిర్ణయాలు

 శ్రీశైల దేవస్థానం: శ్రీశైల సరిహద్దులు గుర్తించేందుకు చేపట్టిన సర్వే,  శ్రీలలితాంబికా దుకాణాల సముదాయం లో  దుకాణాల కేటాయింపు విషయాలపై  గురువారం  సమీక్షా సమావేశం జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షుల   చాంబర్ లో  జరిగిన ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులురెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి  ఎస్. లవన్న , ధర్మకర్తల మండలి సభ్యులు  మేరాజోత్ హనుమంతునాయక్, ప్రత్యేక ఆహ్వానితులు  తన్నీరు ధర్మరాజు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో క్షేత్ర పరిధి  సరిహద్దులు గుర్తించేందుకు  సర్వేకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

 దేవస్థానం, అటవీశాఖ సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖ సంయుక్తంగా ఈ భూ సర్వేను చేపట్టాయి. దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక అటవీశాఖ అధికారులు, నంద్యాల జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డు అధికారులు ఈ సర్వే పనులలో పాల్గొంటున్నారు.సర్వే ముగిసిన అనంతరం క్షేత్రపరిహద్దులో క్యారెన్సును ( గుర్తింపు స్తంభాలు) దేవస్థానం ఏర్పాటు చేస్తుంది.దేవస్థాన సరిహద్దు మొత్తంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేస్తారు.

శ్రీశైలముఖద్వారం నుంచి క్షేత్రం వరకు రహదారిని విస్తరించేందుకు (రోడ్డు వైడనింగ్ ) ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. ఈ రోడ్డు వెడల్పుకు అవసరమైన అటవీశాఖ వారి భూమి పరస్పర బదిలీ పద్ధతిపై దేవస్థానానికి ఇవ్వవలసినదిగా అటవీశాఖ వారిని కోరాలని నిర్ణయించారు.అదేవిధంగా సాక్షిగణపతి ఆలయం వద్ద ఇరువైపులా వాహనాల పార్కింగుకు అవసరమైనంత మేరకు పరస్పర దిలీ పద్దతిపై అటవీ భూమిని దేవస్థానానికి ఇవ్వవలసినదిగా కూడా అటవీశాఖ వారిని కూడా కోరాలని నిర్ణయించారు.ఈ  రెండు ప్రణాళికలు అనుసరించి దేవస్థానం కోరుతున్నటువంటి భూమికి ప్రతిగా నిబంధనల మేరకు దేవస్థానం పరిధిలో ఉన్న భూమిని అటవీశాఖ వారికి అప్పగించాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించారు.

లలితాంబికా వాణిజ్య సముదాయంలో

దుకాణాల కేటాయింపుపై చర్చ:

ఈ సమీక్షా సమావేశంలోనే లలితాంబికా దుకాణ సముదాయం  దుకాణాల కేటాయింపు సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు.ఈ దుకాణాల కేటాయింపున కు 03.12.2022 ఉదయం 11 గంటలకు మల్లికార్జున కల్యాణమండపంలో 

 డిప్ నిర్వహిస్తారు.ఈ డిప్నకు దుకాణాల యజమానులు మాత్రమే స్వయంగా హాజరు కావాలసివుంది.

 30.11.2022 నాటికి పూర్తి బకాయిలు చెల్లించిన దుకాణ యజమానులు మాత్రమే డిప్ సిస్టమ్ లో  పాల్గొనేందుకు అనుమతీస్తారు.డిప్లో పాల్గొనే దుకాణ యజమానులు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డును సమర్పించవలసి

వుంటుంది.లీజుదారుడు మరణించిన,  వారి వారసులు తమకు ఎలాంటి పేచీలు లేవని తెలియపరుస్తూ వ్రాసిన లేఖతో పాటు తహశీల్దార్ వారిచే జారీ చేసిన కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం కూడా తప్పనిసరిగా సమర్పించవలసి వుంటుంది.

print

Previous post

పాడి పరిశ్రమ రంగం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి-మంత్రి తలసాని

Next post

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బిసి మహిళా వ్యవసాయ గురుకుల కళాశాలలో  గెస్ట్ ఫ్యాకల్టీ అవకాశం

Post Comment

You May Have Missed