
* కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ రోజు (10-08-2021) న జిల్లా పరిశ్రమల శాఖ, ఏపీఐఐసి, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, చేనేత, జౌళి శాఖ, టూరిజం, లేబర్ డిపార్ట్మెంట్ లతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు . పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం.కె.వి శ్రీనివాసులు , జిల్లా పరిశ్రమల శాఖ, ఏపీఐఐసి, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, చేనేత మరియు జౌళి శాఖ, టూరిజం, లేబర్ డిపార్ట్మెంట్ ల అధికారులు, తదితరులు .
కర్నూలు, ఆగస్టు 10 :-ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ పార్కు పనుల పై ప్రత్యేక దృష్టిసారించి సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు ఆదేశించారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల శాఖ, ఏపీఐఐసి, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, చేనేత మరియు జౌళి శాఖ, టూరిజం, లేబర్ డిపార్ట్మెంట్ లతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు
సమీక్షలో జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం)ఎం.కె.వి శ్రీనివాసులు, జిల్లా పరిశ్రమల శాఖ, ఏపీఐఐసి, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, చేనేత మరియు జౌళి శాఖ, టూరిజం, లేబర్ డిపార్ట్మెంట్ ల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధికి శ్రద్ధ తో ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. ఏపీఐఐసీ సంబంధించిన భూములను పారిశ్రామిక రంగానికి అమ్మే విధంగా చేయడంతో పాటు ఇంకా సేకరించాల్సిన భూసేకరణను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఏపీఐఐసీ జెడ్ ఎం వెంకటనారాయణమ్మను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఏపీఐఐసీ సంబంధించిన భూములలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి ప్రభుత్వం అందించే పథకాలతో పాటుగా పరిశ్రమల ఏర్పాటుకు కావలసినటువంటి మౌలిక వసతులు అన్ని సహాయ సహకారాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. పరిశ్రమలు నెలకొల్పడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని తద్వారా జిల్లాలో పరిశ్రమల ఆర్ధిక పురోభివృద్ధితో పాటు..యువతకు మెండైన ఉపాధి అవకాశాలు అందగలవని, పరిశ్రమలే జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అని..జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వాలన్నారు. పరిశ్రమల స్థాపన వల్ల వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించడంతో పాటు, జిల్లా ఆర్ధిక ప్రగతి కూడా మెరుగు పడుతుందన్నారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చేయడం వల్ల జిల్లా కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని…ఆ దిశగా పర్యాటకరంగం అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఏపీటీడీసీ, టూరిజం ఎస్ఈ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి కొరకు తీసుకోవలసినటువంటి చర్యలు తదితర వాటి పై మరొకసారి సమీక్ష చేయాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఫ్యాక్టరీకి సంబంధించి లేబర్, పరిశ్రమల్లో సౌకర్యాలు, కార్మికుల భద్రత దృష్టిలో పెట్టుకొని తగు చర్యలు తీసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమల్లో తీసుకోవాల్సిన భద్రత చర్యలు పై ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమల పరంగా ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ తో పెద్ద ఎత్తున అవగాహన కల్పించి పారిశ్రామిక, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు కార్యచరణ చేపట్టాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.