హైదరాబాద్: సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ముఖ్యమంత్రి వెంట వున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని మాజీ మంత్రి కేటీఆర్, వైద్యులను సిఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.