శ్రీశైల దేవస్థానం: దేవస్థానం లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కె. వెంకటేశ్వర్లు, గూర్ఖగా విధులు నిర్వహిస్తున్న గజయ్ సింగ్ బండారి ఈ రోజు (31.05.2021) న పదవీ విరమణ చేశారు.
కార్యనిర్వహణాధికారి కే ఎస్ .రామరావు వీరికి శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.
సాధారణంగా దేవస్థానం లో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు వీడ్కోలు సమావేశం నిర్వహిస్తారు.
అయితే ప్రస్తుత కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా సమావేశం నిలుపుదల చేసారు.
జూనియర్ అసిస్టెంట్ గా పదవీ విరమణ చేసిన కె. వెంకటేశ్వర్లు 28.03.1998లో దేవస్థానములో నియామకాన్ని పొందారు. . తరువాత 2005లో రికార్డు అసిస్టెంట్ గా, 2013లో జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందారు. వీరు 23 సంవత్సరాలకు పైగా విధులు నిర్వహించారు.
గూర్ఖగా పదవీ విరమణ చేస్తున్న గజయ్ సింగ్ బండారి 02.09.1993లో గూర్ఖగా నియామకాన్ని పొంది, 27 సంవత్సరాలకు పైగా విధులు నిర్వహించారు.
*Sahasra deepaarchana seva performed by Archaka swaamulu.