
శ్రీశైలదేవస్థానం: మామూలు రోజులలో స్వామివార్ల స్పర్శదర్శన కాలపరిమితి పెంచేందుకు పరిశీలిస్తామని ఈ ఓ పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఈ రోజు (22.12.2021) డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని నిర్విహించింది.
రాష్ట దేవదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
దేవస్థానం పరిపాలనా విభాగం లోని సమీక్షా సమావేశ మందిరం లో జరిగిన ఈ కార్యక్రమం లో మొత్తం 23 మంది భక్తులు డయల్ యువర్ ఈఓ కార్యక్రమం లో పాల్గొని తమ సలహాలు సూచనలను అందజేశారు.
సాధారణ భక్తులకు మామూలు రోజులలో స్వామివార్ల స్పర్శదర్శన కాలపరిమితి పెంచాలని భక్తులు కోరారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ మరో గంటకు పెంచేందుకు పరిశీలిస్తామని తెలిపారు.
ప్రతిరోజు శివనామ నగర సంకీర్తన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరడంతో పరిశీలించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.
దాతల గుర్తింపు కార్డులు, పరోక్షసేవల ప్రసాదాలను త్వరగా పంపే ఏర్పాటు చేయాలని పలువురు సూచించారు.
దాతల గుర్తింపు కార్డలను, పరోక్షసేవల ప్రసాదాలను పోస్టు ద్వారా పంపుతామని ఈ ఓ చెప్పారు. ఈ విషయమై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఆ తరువాత పలువురు భక్తులు, శ్రీశైలప్రభ సకాలంలో పంపవలసిందిగా కోరారు.
ఈ విషయమై కార్యనిర్వహణాధికారి స్పందిస్తూ పత్రికను సకాలంలో పంపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
డయల్ యువర్ ఈఓ కార్యక్రమం అనంతరం కార్యనిర్వహణాధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.