
శ్రీశైల దేవస్థానం:ఆలయ పశ్చిమ మాడావీధి (శివవీధి) సుందరీకరణ పనులకు చర్యలు మొదలయ్యాయి.
పశ్చిమ మాడావీధి ఎగువ భాగంలోని ఏనుగుల చెరువుకట్టపై ఉన్న నివాసగృహాలను తొలగించేందుకు అక్కడ నివాసం ఉన్నవారికి ఇప్పటికే ప్రత్నామ్యాయం చూపించారు.
సుందరీకరణ చర్యలలో భాగంగా ఈ రోజు (27.10.2021)న ఏనుగుల చెరువుకట్టపై ప్రస్తుతం ఖాళీ అయిన నివాస గృహాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది.
పశ్చిమ మాడావీధి ఎగువ భాగంలో నివాస గృహాల తొలగింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే సుందరీకరణ పనులు ప్రారంభమవుతాయి.
ముఖ్యంగా మాడావీధి ఎగువ భాగంలో పచ్చదనాన్ని పెంపొందించి భక్తులు సేద తీరేందుకు వీలుగా బెంచీలు తదితర సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తారు.
తిరుమల మాడావీధుల తరహా పశ్చిమ మాడావీధి పడమర వైపు గ్యాలరీ నిర్మాణానికి కూడా ప్రణాళిక చేసారు. ఇందుకు సంబంధించిన అంచనాలు కూడా సిద్ధం అయ్యాయి.