శ్రీశైల దేవస్థానం: ఈ సంవత్సరం కార్తీక మాసంలో మొత్తం దేవస్థానానికి రూ.30,89,27,503/-లు రాబడిగా
లభించింది.కార్తీక మాసంలో ఇంత భారీ మొత్తంలో రాబడిగా రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. గత సంవత్సరం కార్తీకమాసం కంటే కూడా ఈ సంవత్సరం కార్తీక మాసంలో మొత్తం రూ. 11,02,73,725/-లు అధికంగా లభించింది. అధికార ప్రకటనలో వివరాలు ఇవి.
గత సంవత్సరం కార్తీక మాసంలో మొత్తం రూ. 19,86,53,778/-లు రాబడి కాగా ,మొత్తం మీద గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం 55.51 శాతం రాబడి పెరిగింది.
ఈ సంవత్సరం కార్తీక మాస మొత్తం ఆదాయంలో ( రూ.30,89,27,503/-లు) సాధారణ జమల ద్వారా రూ. 19,95,73,883/-లు, హుండీ ద్వారా రూ.6,73,79,922/-లు, ఆన్లైన్ ద్వారా రూ.3,25,68,719/-లు , అన్న ప్రసాద పథకానికి విరాళాల ద్వారా రూ.94,04,979/- లు రాబడిగా నమోదైంది.
ఇటీవల ప్రవేశపెట్టిన ఉదయాస్తమానసేవ ద్వారా రూ.8,08,928/-లు లభించగా ప్రదోషకాలసేవ ద్వారా రూ. 22, 35,324/-లు రాబడిగా వచ్చింది. ఈ రెండు నూతన సేవల ద్వారా పెరిగి కార్తీక మాసంలో రూ. 30,44,252/- లు లభించాయి.
ఇక సాధారణ జమలలో శ్రీస్వామివార్ల అభిషేకాల ద్వారా రూ.2,20,56,210/-లు, కుంకుమార్చనల ద్వారా రూ.62,88,712/-లు, ఇతర ఆర్జితసేవల ద్వారా రూ.94,42,942/-లు రాబడి వచ్చింది.అదేవిధంగా దర్శనాల ద్వారా అనగా శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం మొదలైన వాటి ద్వారా రూ. 6,32,69,771/-లు లభించాయి.
ఇక లడ్డు, పులిహోర ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 4,96,18,620/-లు లభించాయి. కాగా వసతికల్పన (గదులు, కాటేజీలు) గాను రూ.92,30,831/- లు రాబడి వచ్చింది.
టోల్ గేట్ ద్వారా రూ.87,26,350/-లు, ప్రచురణల విక్రయాల ద్వారా రూ.37,84,911/-లు కైలాస కంకణాల విక్రయం ద్వారా రూ. 12,69,295/-లు, విభూతి విక్రయం ద్వారా రూ.11,57,840/- లు రాబడిగా నమోదైంది.
కేశఖండన టికెట్ల ద్వారా
కాగా ఆన్లైన్ మొత్తం రాబడి రూ.3,25,68,719/-లలో పరోక్షసేవల ద్వారా రూ.28,83,188/-లు, ఇ – హుండీ ద్వారా రూ. 1,86,103/- లు రాబడి లభించింది. అలాగే అన్నప్రసాద ట్రస్టుకు రూ.5,12,028/-లు, గో సంరక్షణ ట్రస్టుకు రూ.2,28,016/-లు, ఆగమపాఠశాల ట్రస్టుకు రూ.87,919/-లు ముందస్తు దర్శనాల టికెట్ల ద్వారా రూ.1,12,20,302/-లు ముందస్తు వసతి ద్వారా రూ. 11,40,723/-లు రాబడి నమోదైంది.