భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ
భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ శిల్పుల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ లోహ శిల్ప కళాకారుల లోహశిల్పాల ప్రదర్శన ‘లోహ శిల్ప కార్యశాల’ (SCRAP SCULPTURE WORKSHOP) గత 5 రోజులుగా రవీంద్రభారతి ఆవరణ ప్రాంగణంలో జరిగింది. ఇందులో భాగంగా కళాకారులు వివిధ రకాలైన పనికిరాని లోహ వస్తువుల వీడే భాగాలు, సైకిల్ చిన్, స్ప్రింగులు, మూకుడు, టూ వీలర్, త్రీ వీలర్ వాహనాల విడి భాగాలు మొదలైనవాటితో చేసిన లోహ శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇందులో కాకతీయ కళాతోరణం, చార్మినార్, బతుకమ్మ, పోతురాజు, దుర్గామాత, కృష్ణజింక, బోనమేట్టిన మహిళా, గుస్సాడి వేషధారణలో గిరిజన మహిళా, వాద్య కళాకారుడు, హరిత తెలంగాణ లాంటి లోహ కళాకృతులు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్యులు అజ్మీరా చందూలాల్ గారు మాట్లాడుతూ సంస్కృతీ, కళలను, అన్ని కళారూపాలను ప్రోత్శాహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమేనని, ఎప్పుడూ ముందుంటుందని చెప్పటానికి ఎటువంటి సందేహం లేదని అన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ, మన ముఖ్యమంత్రిగారు కే.సి.ఆర్ గారు ప్రతి కళను ప్రోత్సహించాలని ఎప్పుడూ చెపుతుంటారని గుర్తు చేసుకున్నారు.
అమర శిల్పి జక్కన్న చెయ్యి పడ్డ శిలలు శిల్పాలయినట్టు, ఈ లోహ కళాకారులు ఏ పనికిరాని ఇనుపముక్కలను సైతం కళాఖండాలుగా తీర్చిదిద్దారు. అందుకు నిదర్శనమే ఈ లోహ శిల్పకార్యశాలలో వున్నా లోహ శిల్పాలు తెలంగాణ శిల్పుల సమాఖ్య అధ్యక్షుడు మాట్లాడుతూ మేమంతా పూర్తిగా పనికిరాని లోహ వస్తువులను సేకరించి ఈ లోహ శిల్పాలను తయారుచేశాం. ఈ లోహాలతో చేసిన శిల్పాలు కూడా ఒక కళారూపమే అని అన్నారు.
ఈ కార్యక్రమములో శిల్పాలు చేసిన కళాకారులను అభినందించి, నగదు బహుమతిని, ప్రశంసాపత్రాలను అందిచారు.