
• శ్రీశైల సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజు ఆదివారం స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.
• ఈ సాయంకాలం స్వామిఅమ్మవార్లకు రావణ వాహనసేవ సంప్రదాయ రీతిలో జరిపారు.
• ఉత్సవాలలో భాగంగానే రుద్రహోమం, పారాయణలు, జపానుష్ఠానాలు జరిగాయి.
• ఈ ఉదయం గంగాధర మండపం వద్ద భోగి మంటల కార్యక్రమం జరిగింది.
• భోగి సందర్భంగా చిన్నారులకు సామూహిక బోగిపండ్ల కార్యక్రమం జరిపారు.
• పురవీధుల్లో స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు.
• 15వ తేదీ ఉదయం మహిళలకు దక్షిణ మాడవీధిలో ముగ్గుల పోటీలు జరుగుతాయి.
• 15వ తేదీ సాయంత్రం స్వామిఅమ్మవార్ల బ్రహ్మోతవ కల్యాణం నిర్వహిస్తారు.
శ్రీశైల దేవస్థానం లో స్వచ్ఛతీర్థ కార్యక్రమం ప్రారంభమైంది.,
• 8 రోజుల పాటు 14 నుంచి 21 వరకు కార్యక్రమ నిర్వహణ వుంటుంది.
• స్వచ్ఛతీర్థ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
• క్షేత్ర పరిధిలో విస్తృతంగా పారిశుద్ధ్య చర్యలు తీసుకుంటున్నారు.
*సంక్రాంతి సందర్భంగా న్యూఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో దేవస్థాన లడ్డు ప్రసాదాల విక్రయ కేంద్రం ఏర్పాటు చేసారు.