రమ్యంగా రావణ వాహన సేవ

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అయిదో  రోజు బుధవారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.యాగశాల లో  శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు చేసారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు జరిగాయి.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా నిర్వహించారు.

 ఈ సాయంకాలం ప్రదోష కాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిగాయి.

రావణ వాహనసేవ:

ఈ బ్రహ్మోత్సవాలలో  వాహనసేవలలో భాగంగా సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు రావణ వాహనసేవ నిర్వహించారు.

ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు చేసారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం జరిగింది. కోలాటం, చెక్కభజన, రాజబటులవేషాలు, జాంజ్ పథక్, జానపద పగటి వేషాలు, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, తప్పెటచిందు బీరప్పడోలు, చెంచునృత్యం, నందికోలసేవ, ఢమరుకం, చితడలు, శంఖం, పిల్లన్నగ్రోవి తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ప్రదర్శించారు.

print

Post Comment

You May Have Missed