
- మచిలీపట్నం: బచ్చుపేట శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయంలో జరుగుతున్న స్వామి వారి కల్యాణం అనంతరం గొప్ప ఘట్టం రథోత్సవం. గురువారం ఈ రథోత్సవం ఉల్లాసంగా జరిగింది. ఆలయ అధికారులు, అర్చక స్వాములు. భక్త గణం ఉత్సాహంగా ఈ రథోత్సవం జరిపారు. విద్యుత్ కాంతులతో చక్కని ఏర్పాట్లతో నిర్వహించారు.