పుష్పపల్లకీ సేవలో పులకించిన శ్రీశైల క్షేత్రం

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరో  రోజు ఆదివారం  శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి.యాగశాలలో  శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపారు.

 సాయంకాలం ప్రదోష కాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు చేసారు.

పుష్పపల్లకీ సేవ:

 బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి శ్రీస్వామిఅమ్మవార్లకు పుష్పపల్లకీ సేవ నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి పుష్పపల్లకీసేవ లో ఇ ఓ లవన్న, భక్తాదులు పాల్గొన్నారు.

ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన శ్రీ స్వామిఅమ్మవార్లఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో వేంచేబు చేయించి ప్రత్యేక పూజలు చేసారు.తదుపరి వివిధ పుష్పాలతో అలంకరించిన పుష్పపల్లకి మేళతాళాలతో శ్రీ స్వామి అమ్మవార్లను తొడ్కొని వచ్చి పుష్పపల్లకిలో ఊరేగింపు జరిపారు.

ఈ విశేష సేవలో ఎర్రబంతి, పసుపు బంతి, తెల్లచేమంతి, పసుపు చేమంతి, కనకాంబరాలు, డచ్ రోస్, అశోక పత్రాలు, కాగడాలు, గ్లాడియేలస్, అస్పెర్ గ్రాస్,జబ్రా, కార్నేషన్, ఆర్కిడ్స్, నందివర్ధనం, గరుడవర్ధనం మొదలైన పలు రకాల పుష్పాలను వినియోగించారు.

పురాణాలలో శ్రీశైల మల్లికార్జున స్వామివారు పుష్పప్రియుడని ఉంది. ఈ కారణంగానే ఆయా కైంకర్యాలన్నీ శ్రీ స్వామివారికి పరిపూర్ణంగా అర్పింపజేయాలనే భావనతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోనూ, సంక్రాంతి మహోత్సవాలలోనూ,దసరా మహోత్సవాలలోనూ ఈ పుష్పపల్లకి సేవ నిర్వహిస్తున్నారు.

print

Post Comment

You May Have Missed