
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల మహా పుణ్య క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు లో ఆరో రోజైన బుధవారం శ్రీభ్రమరాంబ సమేత శ్రీమల్లికార్జున స్వామి పుష్ప పల్లకీలో అంగరంగ వైభవంగా భక్తులకు దర్శనం.
- పుష్పపల్లకీసేవ, గ్రామోత్సవంలో కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్యస్వామి, శ్రీమతి ఎం. విజయలక్ష్మీ, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, బి. రామమోహన్ నాయుడు,కె. నాగేంద్ర వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
- శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపారు. యాగశాలలో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిగాయి. సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిగాయి.పుష్పపల్లకీ సేవ: రాత్రి శ్రీస్వామిఅమ్మవార్లకు పుష్పపల్లకీసేవ నిర్వహించారు.ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో వేంచేపు చేయించి ప్రత్యేక పూజలు జరిపారు.తదుపరి పుష్పపల్లకి మేళతాళాలతో శ్రీ స్వామిఅమ్మవార్లను తొడ్కొని వచ్చి వివిధపుష్పాలతో అలంకరించిన పుష్పపల్లకిలో ఊరేగింపు నిర్వహించారు. ఈ విశేష సేవలో ఎర్రబంతి, పసుపు బంతి, తెల్లచేమంతి, పసుపు చేమంతి, కనకాంబరాలు, డచ్స్, అశోక పత్రాలు, కాగడాలు, గ్లాడియేలస్, అస్పెర్ గ్రాస్, జబ్రా, కార్నేషన్, ఆర్కిడ్స్, నందివర్ధనం, గరుడవర్ధనం మొదలైన పలు రకాల పుష్పాలను వినియోగించారు.
పురాణాలలో శ్రీశైల మల్లికార్జున స్వామివారు పుష్పప్రియుడని చెప్పబడింది. ఈ కారణంగానే ఆయా కైంకర్యాలన్నీ శ్రీ స్వామివారికి పరిపూర్ణంగా అర్పింపజేయాలనే భావనతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోనూ, దసరామహోత్సవాలలోనూ ఈ పుష్పపల్లకి సేవ నిర్వహిస్తున్నారు.
- మీకు కేటాయించిన విధులలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి:జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి .
- శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రత చర్యలను జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హరిహరరాయ గోపురం, మల్లమ్మ కన్నీరు, నంది మండపం, ఆర్టీసీ బస్టాండ్, నంది సర్కిల్, టోల్గేట్, సాక్షి గణపతి, ముఖద్వారం, పాలధార పంచదార, శివాజీ గోపురం మొదలగు ట్రాఫిక్ పాయింట్స్ ఆకస్మికంగా తనిఖీ చేసి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచనలు సలహాలు ఇచ్చారు .అనంతరం సిబ్బందికి కేటాయించిన బ్యారెక్స్ ను సందర్శించి సిబ్బందికి ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడుతూ ఆహార సదుపాయాలు, ఫ్యాన్లు , విద్యుత్ సౌకర్యం, స్నానం , కావలసిన వసతులు ఉన్నాయని అడిగి తెలుసుకొని సిబ్బందికి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. మీకు కేటాయించిన విధులలో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఏ అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు.శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం బందోబస్తు సిబ్బందిని 9 సెక్టార్లుగా విభజించారు. ప్రతి సెక్టార్ కు ఇద్దరు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను నియమించారు. ఇద్దరూ లేదా నలుగురు సబ్- ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను నియమించారు.ట్రాఫిక్ మొత్తాన్ని సెక్టార్ 07 కింద తీసుకొని అందులో 10 జోన్లను ఏర్పాటు చేసారు. ఈ ట్రాఫిక్ బందోబస్తు సిబ్బంది అందరికీ ఇద్దరు డిఎస్పీ స్థాయి అధికారులను 16 మంది ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను 36 మంది ఎస్ఐ స్థాయి అధికారులను నియమించి పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేసారు.మొత్తం బందోబస్తు అంతటికీ ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 07 మంది డిఎస్పీలు, 37 మంది ఇన్స్పెక్టర్లు, 66 మంది సబ్-ఇన్స్పెక్టర్ లు,194 మంది HC / ASI లు, 297 మంది పోలీసులు, 37 మంది ఉమెన్ పోలీసులు, 196 మంది హోంగార్డ్స్ ,11 మంది ఉమన్ హోంగార్డ్స్ మొత్తం 866 మందిని ఇప్పటివరకు బందోబస్తుగా నియమించడం జరిగిందని, ఇంకా ఇతర జిల్లా నుంచి సిబ్బంది రావాల్సి ఉందని మొత్తం 1619 సిబ్బందితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ప్రవీణ్ కుమార్ , ఆత్మకూరు DSP శ్రీనివాసరావు , శ్రీశైలం ఇన్స్పెక్టర్ ప్రసాద్ ,SI గంగయ్య యాదవ్ పాల్గొన్నారు.
- *Bhakti Sangeetha Vibhavari ,
1st Programme at Pushkarini Stage
- Shivadeeksha Shibhiram, 1st progaram.
- cultural programmes and Flower decoration
- మజ్జిగ పాకెట్ల విరాళం:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గాయత్రీ మిల్క్ డైరీ ప్రైవేటు లిమిటెడ్, అనంతపురం వారు లక్ష మజ్జిగ పాకెట్లను దేవస్థానానికి విరాళంగా అందజేశారు.
ఈ మజ్జిగపాకెట్లను కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు కు దాతలు అందించారు.
ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ వీటి విలువ సుమారు రూ. 5 లక్షలు దాకా ఉంటుందని తెలిపారు. - శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళం ::రూ. 1,00,101/-లను బి. బిచప్ప, వికరాబాద్, తెలంగాణా రాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని అన్నప్రసాద వితరణ పర్యవేక్షకులు సి. మధుసూదన్‌రెడ్డికి అందించారు.
- Inspection by MLA and EO during the brahmotsavams.