×

అక్రమ తవ్వకాలు జరగకుండా నిఘా అవసరం -కలెక్టర్ పి. కోటేశ్వర రావు

అక్రమ తవ్వకాలు జరగకుండా నిఘా అవసరం -కలెక్టర్ పి. కోటేశ్వర రావు

కర్నూలు, అక్టోబరు 1 :-జిల్లాలో ఇసుక కొరత లేకుండా చూడటంతో పాటు ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా నిఘా పెట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు ఆదేశించారు.

శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, సెబ్ అడిషనల్ ఎస్పీ(జాయింట్ డైరెక్టర్) తుహిన్ సిన్హా, మైన్స్ అండ్ జియాలజీ డి డి రామ శివా రెడ్డి, ఏడి నాగిణి, గ్రౌండ్ వాటర్ డి డి విద్యాసాగర్, ఇరిగేషన్ ఎస్ఇ శ్రీరామచంద్రమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సిహెచ్ విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు మాట్లాడుతూ…. ఇసుక త్రవ్వకాలు ఎక్కువ లోతు త్రవ్వకాలు జరగకుండా ఉండేందుకు, ఇసుక తవ్వకాలు జరిగేచోట లోకల్ గా ఉన్న అధికారి పర్యవేక్షణ చేసేలా చర్యలు చేపట్టాలని మైన్స్ అండ్ జియాలజీ డిడి ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు ఇసుక సరఫరా విషయంలో వాగులు, వంకల్లో ఉన్న 5000 క్యూబిక్ మీటర్లకు మించకుండా పరిమాణం లెక్కించి స్థానిక అవసరాలకు మరియు సొంత అవసరాలకు ఉచితంగా వాల్టా చట్టం రూల్స్ కు లోబడి అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా మైనింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

print

Post Comment

You May Have Missed