జూన్ 3 నుంచి అనంత పద్మనాభ నూతన ఆలయ నిర్మాణం,  శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి మూలవిరట్ విగ్రహ బింబ ప్రతిష్ట కార్యక్రమాలు

హైదరాబాద్: మణికొండ, పుప్పాలగూడా,  శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కమిటీ వారు అందించిన వివరాలు ఇవి .

(శ్రీ అనంత పద్మనాభ నూతన ఆలయ నిర్మాణం,  శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి మూలవిరట్ విగ్రహ బింబ ప్రతిష్ట.

తేదీ . 05.06.2022 ఉదయం 11.59 ని.కు.)

పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ. చిన జీయర్ స్వామి వారి కరకమలములచే శంకుస్థాపన జరిగిన  శ్రీ శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి నూతన ఆలయ నిర్మాణం,  మూలవిరట్ విగ్రహ బింబ ప్రతిష్ట స్వస్తి శ్రీ చంద్రమానేన శుభకృత్ నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ చవితి (3.6.2022) నాడు పునర్వసు నక్షత్రంలో ప్రారంభించి జ్యేష్ట శుద్ద షష్ఠి 05.6.2022 నాడు ఆశ్లేష నక్షత్రం లో విగ్రహ బింబ ప్రతిష్ట కు భాగవతోత్తములు ,వేద , పాంచరాత్రాగమ పండితులు సుమూహుర్తం గా నిర్ణయించారు.
కార్యక్రమ వివరణ:
తేదీ. 03.06.2022 శుక్రవారం సాయంకాలం. 5.00 నుండి 8.30 ని..వరకు
విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన,రక్షాబంధనం,మృత్సంగ్రహం,అంకురార్పణ,సోమకుంభ స్థాపన, దీక్షాధారణ, జలాది వాసం,పంచగవ్యవాసం,అంకురార్పణ హోమం,ఆదివాస హోమం,వాస్తు హోమం,తీర్ధ ప్రసాద గోష్ఠి.
తేదీ. 04.06.2022 శనివారం ఉదయం. 7.30 నుంచి 12.30 వరకు
నిత్య ఆరాధన, సేవా కాలం,బాలబోగం, తీర్ధ గోష్ఠి, స్వామి వారికి క్షీరాధివాదం, పంచామృతాధివాసం,
కర్మాంగ స్నపానం, ఆదివాస హోమం, వేద విన్నపము, తీర్ధ ప్రసాద గోష్ఠి.

సాయంకాలం. 5.00 నుండి 8.30 వరకు
విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ, విష్వక్సేనా రాధన,పుణ్యాహవాచన, ఫల, పుష్ప, శయ్య,ధాన్య, ఛాయాదివాసం,ఆదివాస హోమం,తీర్ధ ప్రసాద గోష్ఠి.
05.06.2022 ఆదివారం ఉదయం 7.00 నుండి 1.00 వరకు.
నిత్యారాధన,సేవాకాలం,కెబాలబోగం,బింబశుద్జి,గర్తన్యాసం, గర్తన్యాస హోమం, మహా పూర్ణాహుతి, విగ్రహ( బింబ) స్థాపన . వేద విన్నపం, ఋత్విక్ సన్మానం(పండిత సన్మానం). తీర్ధ ప్రసాద గోష్ఠి

*భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ వారు విజ్ఞప్తి చేసారు.

*వివరాలకు: 9912943165, 9441888889, 9959613681

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.